శ్రీకాళహస్తి, ఏప్రిల్ 23 (పున్నమి న్యూస్( కేంద్ర రవాణా శాఖ చేపట్టిన ‘ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్’ (ATS) విధానంలో భాగంగా శ్రీకాళహస్తి మండలం కాపుగున్నేరి వద్ద ‘విష్ణు వెహికల్ వెల్‌నెస్ టెస్టింగ్ సెంటర్’ ప్రారంభమైంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ కేంద్రంలో వాహనాల ఫిట్‌నెస్‌ను మానవ ప్రమేయం లేకుండా అత్యాధునిక సాంకేతికతతో పరీక్షించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రహదారి భద్రతను పెంపొందించడంలో, ప్రమాదాల నివారణలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో, బస్ స్టాండ్ పరిస్థితులను మంత్రి దృష్టికి వీడియో కాల్ ద్వారా తీసుకెళ్లారు. శివరాత్రి నాటికి బస్ స్టాండ్‌ను ఆధునీకరించాలని, తిరుమల భక్తుల సౌకర్యార్థం రేణిగుంటలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే శ్రీకాళహస్తి–తిరుపతి మార్గంలో పాత బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని కోరారు. రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు కొనసాగుతాయని, నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే కృషి జరుగుతుందని తెలిపారు.

కాపుగున్నేరి వద్ద ఆటోమేటెడ్ వాహన పరీక్షా కేంద్రం ప్రారంభం