संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अनकापल्ली

ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి

खबर की मुख्य बातें

  • ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌కు వినతి పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) ఎలమంచిలి, అక్టోబర్ 6: ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన ఆశా కార్యకర్తలు ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
  • అచ్యుతాపురంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద సోమవారం ఈ కార్యక్రమం జరిగింది.
  • ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, సెలవులు కల్పించాలని కోరారు.

ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌కు వినతి

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

ఎలమంచిలి, అక్టోబర్ 6: ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన ఆశా కార్యకర్తలు ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అచ్యుతాపురంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, సెలవులు కల్పించాలని కోరారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా కొత్త ఆశా పోస్టులు మంజూరు చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కోశాధికారి ఈ.పార్వతి, మునగపాక పీహెచ్‌సీ నాయకులు పి.ఎస్.కుమారి, పి.జ్యోతి, అచ్యుతాపురం మండల నాయకులు డి.సరోజిని, సూర్యలక్ష్మి, సీహెచ్.మంగ, రాంబిల్లికి చెందిన ఆర్.రమ్య, సీహెచ్.మంగమ్మ, రేగుపాలెంకు చెందిన ఏ.భూలక్ష్మి, సీఐటీయూ నాయకులు ఆర్.రాము, జి.దేవుడు నాయుడు, కె.సోమ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *