హెచ్ఐవీపై సరైన అవగాహనతోనే దానికి అడ్డుకట్ట వేయవచ్చని నంద్యాల జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ గనోరే అన్నారు. మంగళవారం ఎయిడ్స్ నివారణ ప్రచారంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి సర్వజన ఆసుపత్రి వరకు నిర్వహించిన 5 కిలోమీటర్ల ‘రెడ్ రన్’ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.ఈ రెడ్ రన్ పోటీలలో వినోద్ కుమార్, సావిత్రిబాయి ప్రథమ స్థానాల్లో నిలవగా… వీరు అక్టోబర్ 8న జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని డీఎంహెచ్వో డాక్టర్ శారదాబాయి తెలిపారు. యువత భయం వీడి హెచ్ఐవీ పరీక్షలకు ముందుకు రావాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో వైద్య, క్రీడా శాఖల అధికారులు పాల్గొన్నారు.

అవగాహనతోనే హెచ్ఐవీకి అడ్డుకట్ట: జేసీ సూరజ్ ధనంజయ్