అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘మహిళల భద్రత మనందరి బాధ్యత’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ వేణుగోపాల్‌రావు మాట్లాడుతూ మహిళలు అప్రమత్తంగా ఉండడంతో పాటు స్వీయరక్షణ పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందే విధానాలను వివరించారు. సమస్యలను భయపడకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. సీఐ బి.కోటేశ్వరరావు మహిళల భద్రతపై పలు సూచనలు చేశారు. వైస్ ప్రిన్సిపాల్ కె.శశికుమార్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

అరకు: మహిళల భద్రతపై అవగాహన