संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

అరకు: ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని సీపీఎం దీక్ష

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
అరకు: ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని సీపీఎం దీక్ష

खबर की मुख्य बातें

  • గాంధీ జయంతి సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో అరకులోయలో గురువారం ఒకరోజు దీక్ష నిర్వహించారు.
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కిల్లో సురేంద్ర దీక్షను ప్రారంభించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

గాంధీ జయంతి సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో అరకులోయలో గురువారం ఒకరోజు దీక్ష నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కిల్లో సురేంద్ర దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని, ఓటు హక్కును పరిరక్షించాలని కోరారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నిబంధనలను మార్చడం వల్ల యువ ఓటర్లు తమ హక్కును కోల్పోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీపీఎం అరకులోయ మండల కార్యదర్శి కె. రామారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *