PR గవర్నమెంట్ హై స్కూల్ – కాకినాడలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది

0
16

కాకినాడలోని స్థానిక పి.ఆర్. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జూన్ 21, 2025న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ డీఐ శ్రీ కె.వి.వి. సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు యోగ ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా కాకినాడ పరిసర ప్రాంతాల పాఠశాలల నుండి వచ్చిన 200 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పీడీ లు పట్టాభి మరియు బేగం ల నాయకత్వంలో విద్యార్థులు పలు యోగాసనాలు వేయడం విశేషం.

ప్రధానోపాధ్యాయురాలు ప్రేమజ్యోతి, చేయూత ప్రతినిధి రవి మాట్లాడుతూ, యోగా వల్ల మానసిక స్థైర్యం, శారీరక దృఢత, మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఆసనాలు వేసిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. సతీష్ బాబు మరియు పాఠశాల సిబ్బంది చురుకుగా పాల్గొని, యోగ దినోత్సవాన్ని విజయవంతం చేశారు.

ఈ తరహా ఆరోగ్యవంతమైన కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు.

0
1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here