PM – కిసాన్ పథకం ఫట్ – బుచ్చిరెడ్డిపాలెం రైతుల ఆవేదన.

    0
    91
    పెజ్జాయి కృష్ణారెడ్డి రెడ్డిపాలెం గ్రామం రైతు.
    చామంతిపూడి అంకయ్య పల్లాప్రోలు గ్రామం రైతు.

    8-06-2020 బుచ్చిరెడ్డిపాళెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని రెడ్డిపాలెం, పల్లప్రోలు తదితర గ్రామాలలోని రైతన్నలు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హత కలిగినా లబ్ధి చేకూరడం లేదని ఆవేదనను వ్యక్త పరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను ఆవిష్కరించింది. రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ స్కీమ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసింది. ఈ పథకం కింద కేంద్రం అర్హులైన రైతులకు ఏడాదికి 3 విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6,000 అందిస్తోంది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.6000/-ఆదాయం సహకారం దేశంలోని అన్ని రైతు కుటుంబాలకు ప్రతి నాలుగు నెలల చొప్పున మూడు సమాన వాయిదాలలో అందించబడుతుంది. లబ్ధిదారుల రైతు కుటుంబాలను గుర్తించే బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఈ ఫండ్ నేరుగా బదిలీ చేయబడుతుంది. కార్యాచరణ మార్గదర్శకాల మినహాయింపు ప్రమాణాల పరిధిలోకి వచ్చిన రైతులు ఈ పథకం ప్రయోజనాలకు అర్హులు కారు. నమోదు కోసం రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన స్థానిక పట్వారి/రెవెన్యూ అధికారి/నోడల్ అధికారి (మినిస్టర్-కిసాన్) ను రైతు సంప్రదించాలి. ఫీజులు చెల్లించేటప్పుడు పథకం కోసం రైతులకు రిజిస్ట్రేషన్ చేయడానికి సాధారణ సేవా కేంద్రాలు కూడా అధికారం పొందాయి. పోర్టల్ లో రైతులు ఆన్లైన్ ద్వారా రైతులు తమ స్వీయ రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం తో పాటు, వారి ఆధార్ డేటాబేస్/కార్డు ప్రకారం రైతులు తమ పేర్లను PM-Kisan డేటాబేస్లో సవరించవచ్చు మరియు వారి చెల్లింపు స్థితిని కూడా రైతులు తెలుసుకోగలరు. మీకు డబ్బులు వచ్చాయా? రాలేదా? అనే విషయాన్ని ఆన్‌లైన్‌లోనే సులభంగా చెక్ చేసుకోవచ్చు. pmkisan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి. పోర్టల్ పైన కుడివైపున ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎడిట్ ఆధార్ ఫెయిలూర్ రికార్డ్, బెనిఫీషియరీ స్టేటస్, బెనిఫీషియరీ లిస్ట్ అనే నాలుగు ఆప్షన్లు కనినిస్తాయి. వీటిల్లో బెనిఫీషియరీ స్టేటస్ ఎంచుకోవాలి. ఇప్పుడు మరో కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ సాయంతో డబ్బులు వచ్చాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. కేవలం పీఎం కిసాన్ వెబ్‌సైట్ మాత్రమే కాకుండా పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా ఉంది. దీని సాయంతో కూడా మీరు మీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి దాకా ఈ పథకం కింద షుమారు 8.89 కోట్ల మంది రైతులకు షుమారుగా రూ.17,793 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇప్పటి వరకు 2 హెక్టార్ల లోపు ఉన్న రైతులకే పీఎం కిసాన్ వర్తింప చేశారు. దీని ద్వారా కొంతమేరా మాత్రమే లబ్ధి చేకూరింది. ఇక నుంచి అందరికీ వర్తింపచేయడంతో షుమారు 14.50 కోట్ల మందికి ఈ లబ్ధి పెరగనుంది.

    అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వై ఎస్ ఆర్ రైతు భరోసా పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులకు రూ.13,500 ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే రూ 11,500ను జమ చేయగా. మిగిలిన రూ.2వేలు ఇప్పుడు జమ చేస్తున్నారు. లబ్ధిదారుల పేర్లను శుక్రవారం నుంచి గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయని అన్నారు. రైతు భరోసా పథకం కి సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్న ఈ మద్యే సేవలకు అందుబాటులోకి వచ్చిన రైతు భరోసా కేంద్రాలకు వెళ్లిన అక్కడ కూడా వివరాలు అడిగి తెలుసుకోవచ్చని అన్నారు.

    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినా అర్హులైన రైతులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరలేదని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సీజన్లలో పంటకి పెట్టుబడులు కూడా పెట్టుకోలేని సన్నకారు రైతులు చాలామంది ఉన్నారని అన్నారు. ఈ పథకాలన్నీ లేక ముందు పెట్టుబడులకు ఇబ్బంది పడే వాళ్ళమని పెట్టుబడుల కోసం బయట అప్పులు తెచ్చుకోవడం లేదా భార్య మెడలోని పుస్తులను తాకట్టు పెట్టేవాళ్ళమని చెప్పారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతో పెట్టుబడులకు ఇబ్బంది లేదని అన్నారు. కానీ ఈ పథకాలు అర్హతలు కలిగి ఉన్నా చాలా మంది రైతులకు ఆమడ దూరంలోనే నిలిచి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఆయా గ్రామాల రైతులు గ్రామ సచివాలయంలో వివరాలు అడిగితే మాకు తెలియదు ఎమ్మార్వో ఆఫీసుకి వెళ్ళండి అని చెప్తున్నారు. ఇలా కొంతకాలంగా అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగి కూడా ఎటువంటి ఫలితం లేకపోయింది. ఈ సమస్యపై ఎవరి వద్దకు వెళ్లినా పరిష్కారం చూపలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నామన్నారు. ఈ సమస్యను ఎదుర్కొంటున్న బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని రైతులు మండల స్థాయి అధికారులుకు మాకు పరిష్కారం చూపించగలరని వారియొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.