మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.స్త్రీ పురుష సమానత్వం కై పోరాడలని అక్టోబర్ 8,9 తేదీల లో నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు) రాష్ట్ర 7వ మహాసభలను విజయవంతం చేయాలని మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్దిపూర్ గ్రామంలో మహాసభల గోడపత్రికలను విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రగతి శీల మహిళా సంఘం (పిఓడబ్లు) జిల్లా నాయకురాలు కోళ్ళ నాగమ్మ మాట్లాడుతూ నేడు అమలులో ఉన్న పితృ స్వామిక కుటుంబ వ్యవస్థలో పురుషుడు యజమాని కాగా స్త్రీ పరాదీనగా ఉంది పరస్పర ప్రేమ ఇష్టం,అంగీకారంగా,కులమతాలు,డబ్బు, హోదా,బంధుత్వం మొదలైన అంశాలపై ఆధారపడి వివాహ వ్యవస్థ వలన స్త్రీల హక్కులు హరించబడుతున్నాయి.స్త్రీలపై వివక్ష అణిచివేత పెత్తనం పురుషాధిక్యత లాంటి అనేక సమస్యలతో స్త్రీలు
సతమతమవుతున్నారన్నారు. కుటుంబంలో ఆస్తులపై ఆధిపత్యం పురుషునిదే స్త్రీల కర్తవ్యం వారసులను కనడం కుటుంబానికి చాకిరీ చేయడం మాత్రమే అయిపోయింది.ఈ దేశంలో మతాలన్నీ స్త్రీలను అబలగా,పరాదీనగా చిత్రీకరించాయి సహనం, క్షమాగుణం, నమ్రత, సిగ్గు వంటి అనేక లక్షణాలకు ప్రతీకగా స్త్రీని చెబుతున్నాయి దీనిలో భాగంగానే స్త్రీలపై సతీసహగమనం, కన్యాశుల్కం, బాల్య వివాహాలు, పునర్వివాహా నిరాకరణ,బసివిని,జోగిని, దేవదాసి లాంటి దుర్మార్గమైన దూరచారాలకు ఎందరో స్త్రీలు బలైపోయారు రాజా రామ్మోహన్ రాయ్,విద్యాసాగర్, దయానంద సరస్వతి, కందుకూరి వీరేశలింగం, గురజాడ, పూలే లాంటి వాళ్లు ఎందరో సంఘసంస్కర్తలు ఈ దూరరాలకు వ్యతిరేకంగా గళం విప్పారని అన్నారు. నేడు విద్యలోనూ, ఉద్యోగాలలోను, బాధ్యతల నిర్వహణ లోను పురుషులతో పోటీ పడుతున్న స్త్రీని ఇంకా పితృస్వామికి భావాజాలం వెన్నడుతూనే ఉన్నది. బిజెపి అధికారానికి వచ్చిన తర్వాత స్త్రీలపై అత్యాచారాలు ప్రమాదకర స్థాయిలో పెరిగాయి కతువా లాంటి ఘటన లో అనేకంగా జరిగాయి,జరుగుతున్నాయి. పసిపిల్లల నుండి పండు ముసలి వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి. భేటీ పడావో- బేటి బచావో అనేది నినాదం గానే మిగిలిపోయింది. మహిళలకు రక్షణ కరువైంది కేసీఆర్ ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉంది కేంద్ర,రాష్ట్ర బడ్జెట్లో మహిళల కేటాయింపులు తగ్గిపోతున్నాయి. కళ్యాణ లక్ష్మి, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, ప్రసవ మహిళలకు కేసీఆర్ కిట్లు సరిగా అమలు కావడం లేదు. ఆకర్షణీయ పథకాలతో మహిళా ఓటర్లకు గాలం వేయడంలో కోసమే తప్ప మరొకటి కాదు. సమాజంలో ఉన్న రుగ్మతలు, అధిపత్య ధోరణి విడనాడాలని, స్త్రీ లపై జరుగుతున్న లైంగిక దాడులను, హత్యలను, వేధింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రగతిశీల మహిళా సంఘం అనేక పోరాటాన్ని నిర్వహిస్తున్నది అందులో భాగంగానే అక్టోబర్ 8,9 తేదీలలో POW రాష్ట్ర 7వ మహాసభలను నారాయణపేట జిల్లా కేంద్రంలో జరుపుకుంటుంది. ఈ సభలకు మహిళలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మహిళలకు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు నాయకులు సాయమ్మ, కోళ్ళ జయమ్మ,చంద్రకళ, చంద్రమ్మ, లక్ష్మమ్మ, మంగమ్మ, వెంకటమ్మ, రేనమ్మ, జయమ్మ లతో పాటు తదితరులు పాల్గొన్నారు…