మానసిక బలవంతులు ఇలా వుంటారు….
(పున్నమి ప్రత్యేకం)
శారీరక సౌందర్యం కంటే మానసిక అందం ఎంత ముఖ్యమో, శారీరక బలం కంటే మానసికంగా స్ట్రాంగ్ ఉండటం అంతే అవసరం. అసలు మానసిక బలం అంటే ఏమిటి, అది ఉన్నవారి ఆలోచనలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు సైకో థెరపిస్ట్ మోరిన్. ఆమె, థర్టీన్ థింగ్స్ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ అనే పుస్తకాన్ని రాశారు. మనం మానసికంగా ఎంత బల వంతులం అనే విషయాన్ని వార సత్వంగా వచ్చిన మన శరీరంలోని జన్యువులు, మన వ్యక్తిత్వ లక్షణాలు, మనం ఎదుర్కొన్న అనుభవాలు నిర్ణయిస్తాయని చెబుతున్నారామె. మానసిక బలవంతులు ఏఏ పనులు చేయరు. అనే అంశాలను పుస్త కంగా రాసిన ఆమె, మరి వారు ఏ పనులు చేస్తారు. అనే అంశం గురిం చి వివరణ ఇచ్చారు. ఆ విశేషాలు ఇవి- మానసిక బలవంతులకు భావోద్వేగాలు తక్కువగా ఉంటాయి, వారు తమ ఎమోషన్స్‌ని అణ చేసు కుంటారని చాలామంది అను కుంటారు. కానీ అది నిజం కాదు. వారు తమలోని ఎమోషన్స్‌ని బాగా గమనిస్తారు. రోజంతా వాటిపై నిఘా ఉంచుతారు. తమ ఫీలింగ్స్ తమ ఆలోచనలను, ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తున్నాయో పరిశీలి స్తుంటారు. ఆ పరిశీలన వల్లనే వారు తమ భావోద్వేగాలతో కాకుండా ఆలో చనలతో పనిచేస్తుంటారు. ఒక ఫీలింగ్ కారణంగా నష్టం కలుగుతుందనుకుంటే వారు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు కూడా. ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఎవరూ ఉండలేరు. అలా ఉంటే అది నెగటివ్ ఆలోచనల్లోకి దారితీస్తుంది. అది మానసిక బలవంతులకు తెలుసు. అలాగే తమ ఆలోచనలన్నీకరెక్ట్ కాదన్న సంగతిని వారు అర్థం చేసుకుంటారు. మైండ్ నెగెటివ్ ఆలోచనల్లోకి వెళ్లి పోతున్నప్పుడు, వాటిని ఆపి వాస్తవం ఏమిటనే పునరాలోచన చేయగలుగు తారు. మానసిక బలవంతులు అను త్పాదక పనులు ఎప్పుడూ చేయరు. అంటే ఎవరికీ ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వని కాలక్షేపం పనులు. ఈ రోజు చాలా చెత్తగా నడిచింది. అనుకున్న సమయాల్లో, ఆ రోజుని అలా మార్చిం ది ఎవరు, ఏమిటి అనేది పరిశీలించుకుని, ఆ పద్ధతి మార్చుకుంటే కలిగే రిస్క్‌ని లెక్క వేసుకుంటూ ముందుకు నడుస్తారు. -మానసిక బలవంతులు తప్పులు చేస్తే అప రాధ భావం, పశ్చాత్తాపాలతో కుమిలిపోరు. దాన్నుండి పాఠం నేర్చుకుని తమని తాము క్షమించుకుంటారు. ముఖ్యంగా మానసి కంగా బలంగా ఉన్నవారు తమపట్ల తాము చాలా దయగా ఉంటారు. వీరు ఆత్మ విమర్శ చేసుకుంటారు కానీ, పనిగట్టుకుని విమర్శిస్తూ, కుంగదీసే మనసుని పట్టిం చుకోరు. తమ మాటలు, చేతలకు తామే పూర్తిగా బాధ్యత వహిస్తారు. ఇతరులు తమని నడిపించాలని, నియంత్రించాలని ఆశించరు. మంచయినా, చెడయినా తమ పనులకు తామే బాధ్యులమని ఒప్పు కుంటారు.
మానసిక బలవంతులకు కాలం విలువ తెలుసు. అందుకే వారు సమయాన్ని వృథా చేయరు. గతాన్ని తవ్వుకుంటూనో, ఇతరుల కోసం కాలం వెచ్చించి, తరువాత వారిని తిట్టుకుంటూనో కాలం గడపరు. ఏదైనా ఉత్పాదకతనిచ్చే పనిని మాత్రమే చేస్తారు. వీరి మెదడులో తమ లక్ష్యం తాలూకూ పూర్తి చిత్రం ఉంటుంది. ఈ రోజు తీసుకున్న నిర్ణయం, దీర్ఘ కాలంలో తమని ప్రభావితం చేస్తుందనే విషయం వీరికి తెలుసు. వారు ప్రతి సవాల్లోనూ ఒక అవకాశాన్ని సృష్టించు కుంటారు. తమకి తిరుగులేదు అనే అహంకారం మానసిక బలవంతులకు ఉండదు. ప్రతిరోజూ ఎదిగేందుకు సిద్ధంగా ఉంటారు. తమ బలహీన తలను గుర్తిస్తారు, వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. వీరికి తప్పులకు సాకులు వెతుక్కోవడం కంటే, వాటి గురించి పూర్తిగా తెలుసుకుని, మరొక సారి అలా జరగకుండా జాగ్రత్త పడ టమే ఇష్టం.