రాపూరు, మే 17, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలంలోని ప్రజలు ఎవరూ అధైర్యపడకండి..నేనున్నా అంటూ భరోసా కల్పిస్తూ నిత్యం ప్రజా సేవకుడిగా ఏమి ఆశించకుండా తన తండ్రి ఆశయ సాధన కోసం నిరంతరం మండల ప్రజల బాగోగులు చూసుకునే మనసున్న మా రాజు రాపూరు మాజీ ఎంపీపీ మండల వైకాపా కన్వీనర్ దివంగత మహానేత బండి క్రిష్ణారెడ్డిగారి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ ప్రజల హృదయాల్లో స్థానాన్ని పొందుతున్నారు.కరోనా లాక్ డౌన్ లో మండలంలోని 25 వేల కుటుంబాలకు కూరగాయలు, పండ్లు,గుడ్లు పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన ఆయన ఆదివారం రాపూరు మండలంలోని నాగావారిపల్లి గ్రామంలోని ప్రజలు మంచినీటిి కోసం ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి తన సొంత నిధులు 4 లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్ కు పెంచలకోన దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మాజీ ఛైర్మన్ బొడ్డు కృష్ణరెడ్డితో కలిసి భూమిపూజ కార్యక్రమం చేశారు.దీన్ని 30 రోజుల్లో పూర్తి చేసి నాగావారిపల్లి ప్రజలకు శుద్ధిజలం అందిస్తామన్నారు.అలాగే మండలంలోని అకిలి వలసలో ప్రయాణికుల కోసం బండి వేణుగోపాల్ రెడ్డి సొంత నిధులు 2 లక్షల రూపాయలతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించనున్న ప్రయాణికులు సముదాయాన్నికి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిఈఈ కంబాల రవీంద్ర బాబుతో కలిసి భూమిపూజ చేశారు.త్వరలో వీటి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామన్నారు.నా మండల ప్రజల శ్రేయస్సు కోసం ఎప్పుడు ఏమి కావాలన్న చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.మండలంలో పార్టీలకు అతీతంగా సేవ చేస్తున్నామని,ఎవరికి ఏ ఆపదవచ్చినా నన్ను సంప్రదిస్తే నా చేతనైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు నెల్లూరు మధుసూదన రెడ్డి,కసుమూరు రామసుబ్బారెడ్డి, బండి శ్రీనివాసులు రెడ్డి,లక్కకుల శ్రీరాములు, యూటీఎఫ్ నాయకులు పింగాణీ హరిప్రసాద్ రెడ్డి,రాపూరు శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.