కొత్తపేట సబ్ పోలీస్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు

0
3
కొత్తపేట,జులై01,పున్నమి న్యూస్, ప్రతినిధి కిరణ్ : డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సబ్ పోలీస్ డివిజన్ డిఎస్పి సుంకర మురళీమోహన్ ఒక ప్రకటన విడుదల చేశారు.ఆ ప్రకటనలో కొత్తపేట సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు 01-07-2025 నుండి 31-07-2025 వరకు కొత్తపేట సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి
కొత్తపేట ,రావులపాలెం ,ఆత్రేయపురం ,ఆలమూరు ,పి గన్నవరం,అంబాజీపేట ,అయినవిల్లి,నగరం ,రాజోలు ,మలికిపురం ,సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఇది వర్తిస్తుందన్నారు.
సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటివి జరపడానికి వీలు లేదు. అటువంటివి జరపడానికి కొత్తపేట పోలీసు సబ్ డివిజన్ ఎస్డీపీఓ వద్ద ముందుగా అనుమతి పొందవలసి ఉంటుందాని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ గమనించి, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు ఎప్పటిలాగే అందరూ సహకరించవలసిందిగా తెలిపారు.
                                               
0
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here