బామా సుధాకర్ రెడ్డి స్మృతి నీరాజనం ఆవిష్కరణ
కావలి, జూన్ (పున్నమి ప్రతినిధి )
బామా వ్యవస్థాపకులు స్వర్గీయ సుధాకర్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా.నీరాజనంపుస్తకం ను ప్రముఖ రచయిత కాళిదాసు పురుషోత్తం ఆవిష్కరించారు. డాక్టర్ మనోహర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పురుషోత్తం మాట్లాడుతూ రెండు దశాబ్దాల పాటు బామా పేరు తో ఎన్నో సాంస్కృతిక కళా వైభవాలను అందించిన ఘనత సుధాకర్ రెడ్డి దే అని ఆయన కొనియాడారు. సుధాకర్ రెడ్డి స్మృతి గా ఆయన తో ఉన్న మధుర జ్ఞాపకాలను అక్షర రూపంలో సేకరించి పుస్తకం గా తేవడం లో పొనుగోటి క్రిష్ణా రెడ్డి, ఆత్మకూరు కొవ్వొత్తి, బెజవాడ మహి చేసిన కృషి ఫలితంగా మంచి పుస్తకం అందరి ముందుకు వచ్చిందని డాక్టర్ రవి కొనియాడారు. సుధాకర్ రెడ్డి తో తమకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ
పలువురు నివాళి అర్పించారు. ముప్పై మంది వివిధ రంగాలకు చెందిన వారు అడిగిన వెంటనే స్పందించడంతో పుస్తకం తీసుకురాగలిగామని కృష్ణా రెడ్డి పేర్కొన్నారు.తమ సోదరుడు సుధాకర్ రెడ్డి పై చూపిన అభిమానానికి విజయకుమార్ రెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
ప్రముఖ రచయిత పుస్తక రూపకర్త పొనుగోటి క్రిష్ణా రెడ్డి, రవికుమార్ ఆధ్వర్యంలో పలువురికి పుస్తక ప్రతులు అందచేశారు.