పర్యవరణ దినోత్సవం సందర్బంగా శ్రీనిధి కళాశాల అధికారంలో ఎన్‌ఎస్‌ఎస్ శ్రీనిధి కలిసి పర్యావరణ అవగాహన కార్యక్రమం “పర్యావరణ్ సంరక్షణ నడక” నిరవహించడం జరిగింది. ఈ నడక ఘట్కేసర్ ORR వద్ద జరిగింది. పోలీసు శాఖ ఈ కార్యక్రమానికి సహాయం చేసి, మార్గనిర్దేశం చేసింది. ముగింపు కార్యక్రమంలో ఎస్.ఐ. శివ కృష్ణ పాల్గొన్న వారితో మాట్లాడి వారి ప్రయత్నాలను మరియు వారి సహకారాన్ని అభినందించారు. భవిష్యత్ తరాల మెరుగైన భవిష్యత్తు కోసం ఇటువంటి అవగాహన కార్యక్రమాలు అవసరమని ఆయన అన్నారు.
తరువాత విద్యార్థులు శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ టి. శివారెడ్డి మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీమతి ప్రీతి జీవన్ లకు కృతజ్ఞతలు తెలిపారు.