IMPACT అనేది నిస్వార్థంగా పనిచేసే సంస్థ అని మధురం రామచంద్రుడు గారు పేర్కొన్నారు. “జీవితంలో అవకాశాలు వచ్చినప్పుడు అవి ఉపయోగించగలిగిన వారు నిజంగా లక్కీ,” అని ఆయన చెప్పారు. “ప్రతి రంగంలో జాగ్రత్తగా ఉండాలి. నైపుణ్యం పెంపొందించాలి,” అని సూచించారు. ఆయన నేతృత్వంలో 20 మందిని జాయిన్ చేయించి, స్వంత IMPACT క్లబ్ ప్రారంభించే అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. ఇది కేవలం ఓ క్లబ్ కాదు… జీవితాన్ని మార్చే శక్తి. యువతలో మార్పు తెచ్చే గొప్ప అవకాశం ఇది.