- *
పున్నమి ప్రతినిధి పొదలకూరు:-
పట్టణం నడిబోడ్డులో దొంగతనం జరింగింది. చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వరికూటి.రామకృష్ణ రెడ్డి బంగారు ఆభరణాలు బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.86,000/- వేల నగదును తన ద్విచక్ర వాహనం ముందు బాగంలో పెట్టుకుని సినిమా హాల్ థియేటర్ వద్ద ఉన్న పైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ తిని బస్టాండ్ వద్ద పండ్ల దుకాణంలో అరటిపండ్లు తీసుకుంటుండగా ఓ వ్యక్తి వచ్చి బండిలో ఉన్న నగదు తీసుకొని పరారయ్యాడు. ఆ వ్యక్తిని వెంబడించగా స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల వచ్చి ఆ వ్యక్తిని వివరణ అడగగా నా పేరు అశోక్ (25)అని నేను ముంబై ప్రాంతం నుండి వచ్చానని తెలిపాడు. ఆ వ్యక్తి దగ్గర మారణ ఆయుధాలు కూడా ఉన్నాయని గుర్తించి సేకరించారు. విచారణ నిమిత్తం అతనిని పోలీస్ స్టేషన్కు తరలించారు.