పేద విద్యార్థులకు క్రీడా బూట్ల పంపిణీ – కాజ్ సంస్థ సేవా కార్యక్రమం
నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి)
నగరంలోని MCUP దర్గామిట్ట స్కూల్‌లో ఢిల్లీకి చెందిన కాజ్ సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు క్రీడా బూట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 75 మంది బాలబాలికలకు ఉచితంగా బూట్లు అందజేశారు.
కాజ్ సంస్థ డైరెక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కొన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం నగర పాలక ప్రాథమికోన్నత పాఠశాల, దర్గామిట్ట, క్రాంతినగర్ స్కూల్, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, మూలపేట మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదరాజుగూడూరు కు చెందిన బాలబాలికలకు బూట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో MCUP దర్గామిట్ట స్కూల్ హెచ్‌ఎం కొమ్మల కృష్ణయ్య, నెల్లూరు జిల్లా హాకీ అసోసియేషన్ డైరెక్టర్ థామస్ పీటర్, వ్యాయామ ఉపాధ్యాయులు జి.డి. సురేష్, నాగేంద్ర కుమార్, సురేఖ, మాలిని, సీనియర్ హాకీ క్రీడాకారులు అఖిల్, జశ్వంత్, భువన్, ఇంకా పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సేవా కార్యక్రమం విద్యార్థుల్లో క్రీడాపట్ల ఆసక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుందని నిర్వాహకులు తెలిపారు.