संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

*80 అడుగుల జెండాతో దేశభక్తి ర్యాలీ* *కొత్తగుంట టీఎంఆర్‌ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
*80 అడుగుల జెండాతో దేశభక్తి ర్యాలీ* *కొత్తగుంట టీఎంఆర్‌ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 15 చిట్టమూరు మండలం,*

మండల కేంద్రంలోని కొత్తగుంట టీఎంఆర్‌ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్‌ విజయలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ఎందరో మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. దేశం పట్ల గౌరవం, భక్తి, బాధ్యతతో మెలగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. భవిష్యత్‌ తరాలు దేశ సమగ్రత, అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు.
వేడుకల్లో భాగంగా విద్యార్థులు మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ తదితర జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు. అనంతరం 80 అడుగుల భారీ జాతీయ జెండాతో కొత్తగుంటలో విద్యార్థులు నిర్వహించిన దేశభక్తి ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘భారత్‌ మాతాకీ జై’ నినాదాలతో విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ రహమంతుల్లా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

*80 అడుగుల జెండాతో దేశభక్తి ర్యాలీ* *కొత్తగుంట టీఎంఆర్‌ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *