संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अनकापल्ली

7 రోజుల్లో న్యాయం.. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
7 రోజుల్లో న్యాయం.. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు

खबर की मुख्य बातें

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) అనకాపల్లి, అక్టోబర్ 5: బాధితులకు సకాలంలో న్యాయం అందించడమే పోలీస్ వ్యవస్థ పనితీరుకు అసలైన కొలమానమని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ అన్నారు.
  • సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి 45 ఫిర్యాదులను స్వీకరించారు.
  • భూ, ఆస్తి వివాదాలు, ఆర్థిక మోసాలు, కుటుంబ కలహాలు, వేధింపులు, శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను బాధితులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

అనకాపల్లి, అక్టోబర్ 5: బాధితులకు సకాలంలో న్యాయం అందించడమే పోలీస్ వ్యవస్థ పనితీరుకు అసలైన కొలమానమని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి 45 ఫిర్యాదులను స్వీకరించారు. భూ, ఆస్తి వివాదాలు, ఆర్థిక మోసాలు, కుటుంబ కలహాలు, వేధింపులు, శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను బాధితులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ప్రతి ఫిర్యాదుపై వారం రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేసి న్యాయం అందించాలని ఆదేశించారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరపాలని సూచించారు. కేసు పురోగతిని బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని, విచారణ అనంతరం సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మహిళల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని ఎస్పీ స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *