తూర్పుగోదావరిజిల్లా , అమలాపురం :
ఇసుక సామాన్యులకు అందని ద్రాక్షగా మారింది.ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకున్నా రోజుల తరబడి ఎదురుచూపులు అయినా కూడా రాని పరిస్థితి నెలకొని ఉంది.బుక్ చేసిన ఇసుక వచ్చినా కూడా పనికిరాని మట్టితో కూడిన తువ్వ ఇసుక వస్తుండడంతో ప్రజలు అవాక్కయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అయితే తాజాగా సాక్షాత్తు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కే ఈ చేదు అనుభవం ఎదురైంది.రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ భట్నవిల్లిలో నూతనంగా గృహాన్ని నిర్మిస్తున్నారు. ఆన్లైన్ లో ఆయన నాలుగు లారీలు ఇసుక బుక్ చేసుకున్నారు. మట్టి తో కూడిన తువ్వ ఇసుకను తెచ్చి సైట్లో దింపేశారు. సైట్ ఇంచార్జ్ అల్లాడ వెంకటరమణ దీనిని గుర్తించి మంత్రి విశ్వరూప్ కు ఫిర్యాదు చేశారు. నాకే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్య మానవుని పరిస్థితి ఏమిటని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే జిల్లా కలెక్టర్ కు విషయాన్ని వివరించారు.ఈ విషయం పై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వెంటనే అమలాపురం ఆర్టీవో భవానీ శంకర్ భట్నవిల్లి సైట్ లోకి వెళ్ళి ఇసుకను పరిశీలించారు. తువ్వ ఇసుకను చూసి ఆర్. డి. ఓ.అవాక్కయ్యారు విషయాన్ని కలెక్టర్ కు వివరించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ అతి దగ్గరలో ఉన్న రాంపుల నుంచి ప్రజలకు ఇసుక అందించాలని అది నాణ్యమైన ఇసుక అయ్యి ఉండాలని మంత్రి అధికారులును ఆదేశించారు.