చల్లా యానాదులకు అండగా కాకాణి-నిత్యావసరసరుకులు అందజేత

    0
    201


    07-06-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి)
    నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, లక్ష్మీనరసింహాపురం మరియు పిడూరు పాళెం గ్రామాలలో పర్యటించి, చల్లా యానాది కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
    నిత్యావసర సరుకులతో పాటు చల్లా యానాది కుటుంబాలకు ₹1,000/-ల ఆర్థిక సహాయం అందజేత.
    కరోనా నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పలు దఫాలుగా ఉచిత రేషన్ అందించారు.
    సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించాము.
    దాతలు, ముఖ్యంగా రైతులు ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చూపించారు.
    ఆంధ్ర రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో లక్ష కుటుంబాలకు పైగా *”సర్వేపల్లి రైతన్న కానుక”* పేరిట బియ్యం, వంటనూనెను పంపిణీ చేశాము.
    రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పేదల గురించి ఆలోచన చేస్తూ, ఉచిత రేషన్ తో పాటు ₹1000/-ల నగదును అందించారు.
    చల్లా యానాది కుటుంబాలకు రేషన్ కార్డు, ఆధార్ కార్డులు లేనందున ప్రభుత్వం నుండి అందాల్సిన ₹1,000/-ల నగదును అందుకోలేకపోయారు.
    చల్లా యానాదులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ₹1,000/-ల నగదు సాంకేతిక కారణాల వల్ల అందజేయలేక పోయినందున ఆ ₹1,000/-లను నా సొంత నిధుల నుండి అందజేస్తున్నా.
    సర్వేపల్లి నియోజకవర్గంలో రేషన్ కార్డులు లేక ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందుకోలేకపోయిన 960 చల్లా యానాది కుటుంబాలకు నా సొంత నిధులతో ₹1,000/-ల వంతున ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
    రెక్కాడితే కానీ డొక్కాడని చల్లా యానాదులకు ముఖ్యమంత్రి గారు అన్నివిధాలాఅండగానిలుస్తున్నారు.
    ప్రభుత్వ ఇళ్ల మంజూరులో మొదటగా మీ ప్రాంతంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందించి, ఇళ్లు నిర్మించి ఇస్తాము.
    గిరిజన సంక్షేమ అధికారులు యానాదుల సంక్షేమం పై అలసత్వం వహిస్తున్నారు.
    కొంత మంది దళారులు నెల్లూరు లోని ఐ.టి.డీ.ఏ. కార్యాలయంలో కూర్చొని, సంక్షేమ పథకాలు నిరుపేదలైన యానాదులకు దక్కకుండా పక్కదారి పట్టిస్తున్నారు.
    ఈ పరిస్థితిని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్లి, యానాదుల సంక్షేమం గురించిఅన్నివిధాలాకృషిచేస్తాను.
    మీకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు , మీ బిడ్డలకు మంచి విద్యను అందించి, మీ జీవన శైలి మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.
    సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ గుర్తించి, ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాము.
    యానాదులకు వయసును తగ్గించి, పింఛన్లు ఇచ్చేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు.
    యానాదుల అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.
    జిల్లా అభివృద్ధి మండలి సమావేశాల్లో యానాదుల అభివృద్ధిపై, ప్రత్యేకించి చల్లా యానాదుల సంక్షేమంపై చర్చించి తగు చర్యలు తీసుకుంటాం.
    యానాదులకు అన్ని విధాలా అండగా ఉండి, వాళ్ల అభివృద్ధికి కృషి చేస్తాను అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి,బొమ్మిరెడ్డి హర గోపాల్ రెడ్డి ,కడివేటిచంద్రశేఖర్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్ ,ముంగర విజయభాస్కర్ రెడ్డి ,మన్నేమాల సాయి మోహన్ రెడ్డి ,గుమ్మడి వెంకట సుబ్బయ్య,మానికొండ భాస్కర్ ,ఉప్పలపాటి రమేష్ ,పద్మనాభరెడ్డి ,గోపి రెడ్డి ,బాలకృష్ణ రెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు