48వ డివిజన్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
ప్రత్యేక పూజలు, 108 టెంకాయల నివేదనతో జన్మదినం వేడుక
- తిరుపతి: 48వ డివిజన్‌లో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సేన అధ్యక్షుడు గుమ్మడిపూడి కళ్యాణ్ ఆధ్వర్యంలో స్థానిక మహాలక్ష్మి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో అభయాంజనేయ స్వామికి 108 టెంకాయలతో నివేదన చేశారు.
ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ, “భారతదేశంలో చంద్రబాబు లాంటి దూరదృష్టి గల నాయకుడు ఉండటం తెలుగు వారికి గర్వకారణం. ఒకప్పుడు హైటెక్ సిటీ ప్రారంభిస్తే విమర్శించిన వారు, ఇప్పుడు ఆయన దూరదృష్టి విధానాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు,” అని అన్నారు. భవిష్యత్ తరాల కోసం చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు రాష్ట్రాభివృద్ధికి మేలు చేస్తాయన్నారు.
రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ‘P4 పథకానికి’ శ్రీకారం చుట్టారని, దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి పారిశ్రామికవేత్తలు, విదేశాల్లోని దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా చంద్రబాబుకు మద్దతుగా నిలవాలన్నారు.
ఈ వేడుకల్లో బీసీ సెల్ నగర అధ్యక్షుడు ఆర్.కె.టి. రాజ్, సీనియర్ నాయకులు ఆరణి జయశంకర్, వేలూరు రాజ్, అల్లంపాటి వెంకటరమణ, లక్ష్మీ ప్రసాద్, 47వ డివిజన్ యూనిట్ ఇంచార్జ్ రహమాన్ ఖాన్, ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రసన్న కుమార్, ఆనంద్ కుమార్, పుత్తూరు రఘు, కోటపాటి రాజ్, సీమకుర్తి వెంకటేశ్వర్లు, తాతిరెడ్డి శ్రీధర్, ఆర్కాట్ మురళి, నారా శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
వెంటనే అనంతరం టీడీపీ శ్రేణులు పండుగ వాతావరణంలో కేక్ కట్ చేసి చంద్రబాబు జన్మదిన వేడుకను జరుపుకున్నారు.