నేటి నుంచి రవాణా శాఖలో సేవలు యధాతథం

0
123

నేటి నుంచి రవాణా శాఖలో సేవలో యథాతథం
పలమనేరు మే31 2020(పున్నమి విలేకరి సుదర్శన్):పలమనేరు ప్రాంతీయా రవాణా శాఖ కార్యాలయం నందు వాహనదారులకు సేవలను సోమవారం నుండి ప్రారంభం అవుతాయని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేషాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కరోనా వైరస్ వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధన మేరకు లాక్ డౌన్ విధించడంతో కార్యాలయంలోని సేవలను తాత్కాలికంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిలిపివేయడం జరిగిందన్నారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం జూన్ ఒకటో తారీకు నుండి కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇవ్వడంతో మహారాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభించాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కార్యాలయంలోకి వచ్చే ప్రతి ఒక్క వాహనదారులు తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలని, ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని పాటించి సిబ్బంది కూడా సహకరించాలని ఆయన కోరారు. వాహనదారులు ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్నెస్, వెహికల్ ట్రాన్స్ ఫర్, రెన్యువల్ తదితర సేవలను వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.