మామిడి తోటను ధ్వంసం చేసిన ఏనుగులు

0
425

మామిడి తోటను ధ్వంసం చేసిన ఏనుగులు
పలమనేరు మే31 2020,( పున్నమి విలేకరి సుదర్శన్):పలమనేరు రూరల్ మండలంలోని బేరుపల్లి గ్రామానికి చెందిన రైతు కొండారెడ్డి కి చెందిన 12ఎకరాల మామిడి తోటపై వరుసగా వారం రోజులుగా ఏనుగులు గుంపు రాత్రి సమయంలో మామిడి తోటలోనికి ప్రవేశించి మామిడి కొమ్మలను విరిచేసి అందులోని కాయలను ఆరగించి పొలానికి వేసిన నీటి పైపులను సైతం వదలక పూర్తిగా ద్వంసం చేసి చాలా నష్టం పరిచాయిని రైతు ఆవేదన వ్యక్తంచేశారు.ఈ మామిడి పలసాయంతోనే వీరి కుటుంబసభ్యులకు జీవనాధారం. రైతు పొలములో ఇల్లు నిర్మించుకుని కాపురమున్న . ఆ ఇంటి వద్దవరకు మామిడి చెట్లను ద్వంసం చేస్తున్నాయన్నారు. రైతులు పంటపొలాలవద్ద వుండటానికి కూడా భయబ్రాంతులకు గురిఅవుతున్నారు. రైతులు ప్రతి సంవత్సరం పంటలకు అష్టకష్టాలుపడి లక్షలాది రూపాయలు అప్పులుచేసి పంటలపైనే ఆదారపడే రైతులపరిస్ధితి. ఏనుగులవలన పంట పలసాయం పూర్తిగా నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే అటవి సమీపాన గల ప్రాంతాలకు ఏనుగులు రాకుండా శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేసి, పంట నష్టమైన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.