खबर की मुख्य बातें
- ఆత్మకూరు, అక్టోబర్ 9 (పున్నమి ప్రతినిధి): రాబోయేస్థానిక సంస్థల ఎన్నికల్లో ఆత్మకూరు మున్సిపాలిటీపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమర సన్నద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పిలుపునిచ్చారు.
- వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో 28 వార్డుల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.
- శుక్రవారం ఆత్మకూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ప్రజల్లోకి వెళ్లాలని విక్రమ్‌రెడ్డి అన్నారు.
ప్రజాభిప్రాయమే అభ్యర్థుల ఎంపికకు ప్రామాణికం
జగన్ నాయకత్వంలో ఐక్యంగా ముందుకు.. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి
ఆత్మకూరు, అక్టోబర్ 9 (పున్నమి ప్రతినిధి): రాబోయేస్థానిక సంస్థల ఎన్నికల్లో ఆత్మకూరు మున్సిపాలిటీపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమర సన్నద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో 28 వార్డుల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. శుక్రవారం ఆత్మకూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ప్రజల్లోకి వెళ్లాలని విక్రమ్‌రెడ్డి అన్నారు. వార్డుల రిజర్వేషన్లు ఖరారైన తర్వాత అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వస్తుందని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి, స్థానికంగా ఉన్న ఆదరణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారికి, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు లభించేలా చూస్తామని పేర్కొన్నారు.
జగనన్న 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని, 28 వార్డుల్లో ఏ కార్యకర్తకు ఇబ్బంది ఎదురైనా పార్టీ నాయకత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అభ్యర్థి ఎవరనే దానికంటే పార్టీ గెలుపే ముఖ్యమని, పార్టీ నిర్ణయించిన అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్పష్టం చేశారు.పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో కూటమి వ్యవహరించిన తీరుపై ఆయన విమర్శలు చేశారు. భారీగా పోలీసులను మోహరించి ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులను దెబ్బతీశారని ఆరోపించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పేర్కొన్నారు.ఆత్మకూరు నియోజకవర్గంపై జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని, నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డిని ప్రకటించడం స్థానిక ఎన్నికలపై పార్టీ అధినేత వైఖరిని స్పష్టం చేస్తోందన్నారు.కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ప్రశ్నించాలని, ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని విషయాన్ని నిలదీయాలని విక్రమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందాలని, ఆత్మకూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన కోరారు.