‌ప్రతివారికి ఓ సామాజిక విలువ ఉంటుంది

0
120

‌ప్రతివారికి ఓ సామాజిక విలువ ఉంటుంది
ప్రకృతి ప్రకారం అయితే మన పుట్టుకకు ఒక ప్రయోజనం, సార్థకత, అంటూ ఏమీ లేవు. మనం పుట్టినా పుట్టక పోయినా ఈ ప్రకృతికి వచ్చిన నష్టం ఏమీ లేదు. దాని పాటికి అది సాగి పోతూ ఉంటుంది. కోటాను కోట్ల జీవరాసులు ఈ నేల మీద పుడుతూ వుంటాయి, గిట్టుతూ
ఉంటాయి. ప్రకృతి నియ మాలను తు.చ. తప్పకుండా వాటి పని అవి నిర్వర్తించి నిష్క్రమిస్తాయి. ఆ కోణంలో చూసిన ప్పుడు మనిషి జీవితం కూడా ఒక పురుగు, ఒక పక్షి, ఒక జంతువు లాంటిదే. మానవ జాతి కూడా మరో జీవ జాతి లాంటిదే.
ప్రకృతిని పక్కన పెట్టి మనం మన దృష్టితో చూసుకున్నప్పుడు మన పుట్టుక ఇతర జీవ జాతుల మాదిరి సాధా సీదాగా ఉండదు. మనిషి తల్లి కడుపులో పడింది మొదలు తన ప్రమేయం లేకుండా అనేక అంశాలు పుట్ట బోయే బిడ్డ చుట్టూ అల్లుకొని ఉంటాయి. కుటుంబ నేపథ్యం, సామాజిక స్థాయి, ఆర్థిక స్థితిగతులు, వారసత్వపు కళాచారాలు (సంస్కృతి) మొదలయిన ఆపాదింపులతో పుట్టే సమయానికి బిడ్డలకు తెలియకుండానే ఒక సామాజిక ‘‘విలువ’తో పుడ తారు. మిగతా జీవుల పుట్టుకలకు మనిషి పుట్టుకకు తేడా ఇదే. ఈ విలువ ఒక్కొక్క బిడ్డకు ఒక రకంగా ఉంటుంది. ఒక బిడ్డ పుట్టుక కోసం ఆ జాతి మొత్తం (రాజకీయ వారసత్వం కోసం) ఎదురు చూడవచ్చు. తల్లిదండ్రుల సామాజిక ప్రాధాన్య తను బట్టి ఒక బిడ్డ పుట్టుక ఒక ప్రపంచ వార్త కావచ్చు. అలాంటి మరో బిడ్డ తల్లికి అవసరం లేకుండా పుట్టి కుప్పతొట్టి పాలు కావచ్చు. ఈ రెండు పుట్టుకలు ప్రకృతికి ఒకటే. కానీ ఒక పుట్టుక అత్యంత విలువగా, మరొకటి పనికిరాని పుట్టుకగా సమాం పరిగణిస్తుంది. అంటే ప్రకృతికి భిన్నంగా సమాజం ఉం టుంది.
సమాజం అంటే ఏమిటి? సమాజం అంటే ‘తను’ కాక మిగిలిన జనం. అంటే కుటుంబం, చుట్టాలు, ఇరుగు, పొరుగూ, ఊరు, ప్రాంతం, దేశం, ఖండం వెరసి మొత్తం నేలపై ఉన్న మానవ జాతి.
పుట్టుక, చావుల నడుమ కొంత కాలం బతుకు వెళ్ళదీయాలి. మిగతా జీవులు అయితే ప్రకృతిలో వెళ్ళదీస్తాయి. మానవుడు మాత్రం ప్రకృతితోపాటు తనలాంటి వ్యక్తుతో నిండి ఉన్న సమాజంలో నెట్టుకు రావాలి. సమాజంలో మనిషి ఒంటరి కాదు. మనుషుల మధ్య సంబంధాలు తప్పని సరి. ఇవి లేని మనిషిని భూమ్మీద ఊహించలేము.
సంబంధాలు అనేక రకాలు. సంబంధాలు అంటే ‘తన’కు ఇతరుల పట్ల వున్న ‘పట్టింపు’ (శీఅవతీఅ) అలాగే తన పట్ల ‘ఇతరులు’ పట్టింపు. ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధాలు సజావుగా ఉన్నాయా లేవా అనేది ఇరు వైపుల నుండి ఒకరి పట్ల ఒకరికి ఉండే పరస్పర ‘పట్టింపు’ ఆధారంగా ఉంటాయి. పట్టింపు అనేది ఏ రూపంలో అయినా ఉం డవచ్చు. మచ్చుకు కొన్ని పట్టింపులు- ఇష్టం, ప్రేమ, అభిమానం, బాధ్యత, గౌరవం, చీదర, వ్యతిరేకత, ఈసడింపు, పగ, శత్రుత్వం, సంఘీ భావం ఇలా ఏదైనా కావొచ్చు. మన పట్ల ఎదుటి వారి ప్రవర్తనను బట్టి ఈ ‘అనిపింపులు’ (ఖీవవశ్రీఱఅస్త్ర) పుడతాయి. అలాగే మన ప్రవర్తన వల్ల ఎదుటి వారిలో ఈ తరహా అనిపింపులు పుడతాయి.
ఒక వ్యక్తి పట్ల ఏదో ఒక అనిపింపు మాత్రమే ఉండాలనేం లేదు. ఒకటి కంటే ఎక్కువ అనిపింపుల కలగాపులపుగా ఉండ వచ్చు. మచ్చుకు- తండ్రిగా కొడుకు పట్ల బాధ్యత, కొడుకు చెడు చేష్టాల వల్ల వ్యతిరేక అనిపింపు. ఒక వ్యక్తి పట్ల మనకు ఉండే ఈ అనిపింపుల కలయికలతో ఏర్పడే ‘ఉమ్మడి అనిపింపు’ (శీఎఎశీఅ ఖీవవశ్రీఱఅస్త్ర) ను బట్టి ఎదుటి వ్యక్తికి మన మనసులో ఒక ‘‘మానవ విలువ’’  ను ఆపాదిస్తాము. ఒక వ్యక్తి ఎదుటి వారిని కొలవటానికి సరిగ్గా ఈ విలువనే ఉపయోగిస్తాడు. ఇది సదరు వ్యక్తిపట్ల తను ఏర్పాటు చేసుకున్న నిజమైన విలువ. దీన్ని బైటకు వెళ్ళబెట్టి వచ్చు లేకపోనూ వచ్చు. మానవ సంబంధాలు ఈ విలువ మీదే ఆధారపడి
ఉంటాయి. ఇతరులతో మనకు ఉన్న మానవ సంబంధాలు రెండు రకాలుగా ఏర్పడతాయి. మొదటిది ‘కుటుంబ’ నేపథ్యం. ఇందులో సహజంగా సంక్రమించే రక్త సం బంధాలు, సామాజికంగా(పెళ్ళిళ్ళ ద్వారా) కలుపుకున్న చుట్టిరికాలు ఉంటాయి. రెండోది ‘పరిచయ’ నేపథ్యంలో ఏర్పడే ఇరుగూ పొరుగు, స్నేహి తులు, సహ ఉద్యోగులు తదితరులు. ఈ రెండు రకాల వ్యక్తులతో మనకు నేరుగా పరిచయం, సంబంధ బాంధవ్యాలు ఉంటాయి.
ఇవి కాక మూడో రకం బంధ వ్యాలు కూడా ఉంటాయి కానీ అవి నేరుగా వుండవు. కేవలం ఒకే వైపు ఆరాధన, ఇష్టం ఉంటాయి. మచ్చుకు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులుకు ఉండే అభిమానులు.
ఎలా ఏర్పడినా మానవ సం•ం ధాలను విస్మరించి ఏ మనిషినీ ఊహిం చ లేము. ప్రకృతి పరంగా మనకు ఏ విలువ లేక పోయినా సమాజ పరంగా ప్రతి వారికి ‘సామాజిక విలువ’ అనేది ఉండి తీరుతుంది. మనం ఆ విలువ తోనే ఇతరులను కొలుస్తాము. మనల్ని ఇతరులు కొలుస్తారు. ఈ విలువ ముందు చెప్పినట్టు పుట్టుకతో రావచ్చు లేదా పుట్టాక సంపాదించుకోవచ్చు.
– డా।।శ్రీనివాస తేజ

0
0