గత ప్రభుత్వం పెట్టిన రూ.1,323 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆదేశం
తాడేపల్లి: పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హౌసింగ్‌పై గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను పేదలకు చెల్లించాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ హౌసింగ్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో పేదలకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 3,38,144 ఇళ్లకు గాను రూ.1323 కోట్లు చెల్లించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. గత ప్రభుత్వం బకాయిలు పెట్టినా.. పేదలకు అండగా నిలవాల్సిన అవసరముందన్న సీఎం అన్నారు. ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా చెల్లింపులు చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.