హాస్యానికి హృదయాన్ని ఇచ్చిన మహానుభావుడు – చార్లీ చాప్లిన్ జయంతి ప్రత్యేకం
(పున్నమి సాంసృతిక ప్రతినిధి ప్రసాద్ బాబు)
16 ఏప్రిల్ – నిశబ్ద హాస్యానికి పరిపూర్ణ రూపం, ప్రపంచ సినీ చరిత్రలో చిరస్మరణీయుడైన చార్లీ చాప్లిన్ జన్మదినం.
చాప్లిన్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది – మొహంలో చిరునవ్వు, లోపల బాధల తుపాన్లు. ఆయన జీవితం ఒక వైపు దుఃఖంతో, మరోవైపు వినోదంతో నిండి ఉంది. తన జీవితాన్ని తెరమీద హాస్యంగా మలిచాడు, కానీ ప్రతి రూపం వెనక ఒక లోతైన సందేశం దాగి ఉంది.
చాప్లిన్ తన సినిమాలలో మానవ విలువలు, సమాజపు అసమానతలు, మరియు ఆధునిక జీవన ఒత్తిడిని అద్భుతంగా చూపించారు.
‘ది కిడ్’ లో ఆకలితో బాధపడే బాలుడు,
‘సిటీ లైట్స్’ లో ప్రేమలోని అమాయకత్వం,
‘మాడర్న్ టైమ్స్’ లో యంత్రాల మధ్య మానవుల బాధల ప్రతిబింబం – ఇవన్నీ ఆయన సినీ మేధస్సుకు నిదర్శనాలు.
“చాప్లిన్ అంటే హాస్యం వ్యంగ్యం వినోదం
కానీ తాను ఓ చక్కెర పూసిన చేదుమందు” అంటూ ఈ కవితలో ఆయన జీవితంలోని వ్యతిరేక స్వభావాల మధ్య సమతుల్యతను చూపించారు.
ఈ రోజు, చాప్లిన్ జయంతి సందర్భంగా, మనం ఒక్కసారి మనిషిని నవ్వించడం వెనక దాగిన బాధలను గుర్తు చేసుకోవాలి. హాస్యం ఎప్పుడూ తేలిక కాదు – అది లోతైన చింతనకు, అనుభూతికి ప్రతీక.
చార్లీ చాప్లిన్ – నీకు వినమ్ర నివాళి.