खबर की मुख्य बातें
- సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్కు మంత్రి ఆనం అభినందనలు..
- వైద్యులు, సిబ్బందికి ప్రశంసలు ఆత్మకూరు, నవంబర్ 14 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు స్వచ్ఛ ఆంధ్ర పురస్కారం లభించడం పట్ల రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
- శనివారం ఈ పురస్కారాన్ని అందుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్తో పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ఆసుపత్రి సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్కు మంత్రి ఆనం అభినందనలు.. వైద్యులు, సిబ్బందికి ప్రశంసలు
ఆత్మకూరు, నవంబర్ 14 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు స్వచ్ఛ ఆంధ్ర పురస్కారం లభించడం పట్ల రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఈ పురస్కారాన్ని అందుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్తో పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ఆసుపత్రి సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాల తరఫున సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ స్వచ్ఛ ఆంధ్ర పురస్కారాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది సమష్టి కృషిని మంత్రి ప్రశంసించారు.ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతను నిరంతరం నిర్వహించడం, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ కనబరచడం ద్వారా ఈ గుర్తింపు సాధించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ఈ పురస్కారం ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సమన్వయంతో చేసిన కృషికి గుర్తింపుగా నిలుస్తుందని తెలిపారు.
ఇదే స్ఫూర్తితో ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలను మరింత అభివృద్ధి చేయాలని, ఆసుపత్రికి వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేయాలని మంత్రి ఆనం ఆకాంక్షించారు. ప్రభుత్వ వైద్యశాల పరిశుభ్రతతో పాటు వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడంలో సిబ్బంది ఇదే అంకితభావాన్ని కొనసాగించాలని సూచించారు.