సొంత ఊరు ———— వారాల ఆనంద్

0
50

 

(సాహితీ పున్నమి)

విశాలమయిన హాల్లో గోడమీద
వేలాడదీసి వున్న
పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూసి
కొత్తగా ఫ్లాట్లో కలవడాని కొచ్చిన మిత్రుడు అడిగాడు
‘మీ సొంతూరా’ అని
అవునన్నాను
ఎంత అందంగా వుందో
చూస్తేనే హాయిగా ఉందన్నాడు
పచ్చని చెట్లు చల్లని గాలీ
చల్లని చూపులూ ప్రేమ పలకరింపులూ
దోస్తులూ చుట్టాలూ పక్కాలూ
అత్తా మామా అక్కా చెల్లె
అక్కడ విశ్వాసముండేది
ఒంటరితనపు ఛాయే లేని సామూహికత్వముండేది
చేయి చాపితే అందుకునేందుకో చేయుండేది
అంతా విన్న మిత్రుడు దగ్గరికొచ్చి
గుస గుసగా అడిగాడు
‘ ఇప్పుడు లేదా ’
‘దాదాపుగా లేదు’
ఊరే కాదు నేనూ లేను
కళ్ళనిండా తడి ఛాయల్తో గొణిగాను
+++++++++++++++++
Home Town
++++++++++
In the vast hall,
Hanging on the wall,
An old black-and-white photograph beckoned.
A friend, visiting my new flat, looked at it,
His curiosity evident
“Is this your hometown?” he asked.
“Yes,” I replied, with a faint smile
“So beautiful, even just looking at it
Brings peace,” he said.
Lush green trees,
Gentle breezes, kind glances,
Warm greetings,
Friends, neighbors, relatives—
Uncles, aunts, sisters, brothers
There was trust,
Togetherness, untouched by loneliness
If you reached out, another hand is always ready to meet yours.
After hearing me, the friend leaned closer,
His voice dropped to a whisper
Now? Does it still exist?
“Almost gone,”
I murmured.
Not just that place
I am no longer the same either.
With eyes shadowed by moist reflections,
I murmured softly,
As though the memories themselves trembled in response
****
ORIGINAL TELUGU POEM AND ITS ENGLISH TRANSLATION DONE BY THE POET VARALA ANAND

0
0