संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

సెట్ బ్యాక్స్ లేకుండా నిర్మాణం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సెట్ బ్యాక్స్ లేకుండా నిర్మాణం

खबर की मुख्य बातें

  • - నిద్రపోతున్న సిటీ ప్లానింగ్ - పత్తా లేని వార్డు ప్లానర్ - నగదు చేతులు మారినట్లు ఆరోపణలు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో భవన నిర్మాణాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి.
  • సిటీ ప్లానింగ్ నియమ నిబంధనలు నగరంలో అనేక చోట్ల అమలు కావడం లేదు.
  • అక్రమ భవనాలు వెలుస్తున్నాయి.

– నిద్రపోతున్న సిటీ ప్లానింగ్
– పత్తా లేని వార్డు ప్లానర్
– నగదు చేతులు మారినట్లు ఆరోపణలు
నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో భవన నిర్మాణాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. సిటీ ప్లానింగ్ నియమ నిబంధనలు నగరంలో అనేక చోట్ల అమలు కావడం లేదు. అక్రమ భవనాలు వెలుస్తున్నాయి. సంబంధిత సిటీ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదు. ఆయా డివిజన్ల సచివాలయాల వార్డు ప్లానర్లు పత్తా లేకుండా ఉంటున్నారు.

తాజాగా నూతన 30వ డివిజన్ పరిధిలో డోర్ నంబర్ 26-14-1135/2 సమీపంలో ప్రస్తుతం ఒక పెద్ద అపార్ట్‌మెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవనాన్ని పరిశీలించి చూస్తే అనుమతి నాటి నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కినట్లు అర్థమవుతుంది. ప్లాన్‌లో ఒక నియమ నిబంధనలు ఉండగా, క్షేత్రస్థాయి నిర్మాణంలో దానికి విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.

ఇంత పెద్ద భవనానికి ఉండాల్సిన మేర సెట్ బ్యాక్స్ ఉండలేదన్న ఆరోపణలు అయితే తీవ్రంగా ఉన్నాయి. అసలు సంబంధిత డివిజన్ సచివాలయ వార్డు ప్లానర్ ఏమైపోయారో అర్థం కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇక సంబంధిత కార్పొరేషన్ సిటీ ప్లానింగ్ అధికారులు కూడా ఈ భవన నిర్మాణం వైపు కన్నెత్తి చూడలేదని కూడా విమర్శలు ఉన్నాయి.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ భవన నిర్మాణాన్ని పరిశీలించి, నిర్మాణంలో జరిగిన లోపాలపై కన్ను పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *