సాధించాలనే తపన ఉంటే అన్నీ సాధ్యమే

0
275

 

మనిషి ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే ముందుగా బద్దకాన్ని వదిలివేయాలి
ఎవరి జీవితం స్ఫూర్తిదాయ కమో ఎవరి జ్ఞాపకం ఒక ఆశీర్వదమో అతడే విజేత.
తపన లేకుండా ఏ ఒక్కరు ఏ పనిని సాధించలేరు

చేయాలనే పట్టుదల, సాధించాలనే తపన మనిషిని దేన్నయినా సాధించే స్థాయికి తీసుకెళ్తాయి. దాదాపు 100 సం।। క్రితం గాలిలో ఎగరడం అసాధ్యం. మరి ఆనాడు గాలిలో ఎగరాలన్న ప్రయత్నం రైట్‌ ‌సోదరులు చేయకుండా అసాధ్యం’ అని సరిపెట్టుకుని ఉంటే ఈ రోజు మానవుడు విమానంలో ప్రయాణించ గలిగేవాడా. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన ‘ఎడిసన్‌’ ఇక బల్బు కనిపెట్టలేము అనుకుని ఉంటే ప్రపంచం ఇప్పటికీ అంధకారంలో
ఉండదా ఇవి ఉదాహరణలు మాత్రమే. ప్రయోగాలు-శాస్త్రవేత్తలు అన్ని మీకు తెలిసినవే ఇక్కడ మన ఉద్దేశ్యం శాస్త్రవేత్తలు-ఆవిష్కరణలు కాదు. ఆచరణ-ఆశయసాధన.

మనిషి ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే ముందుగా బద్దకాన్ని వదిలివేయాలి ఏదైనా ఒక దానిని సాధించాలనే తపనను మనసులో ఉంచుకోవాలి. దానిపై సాధిస్తామనే నమ్మకం పెట్టుకోవాలి. దాని కోసం కృషిచేయాలి శ్రమిం చాలి పని పూర్తి చేయాలి. ఆ తర్వాతే ఫలితం కోసం ఎదురు చూడాలి. బ్రతికున్న వారం దరిలో కెల్లా నేను తెలివైనవాడిని ఎందుకంటే నాకు ఒక విషయం తెలుసు అదేమిటంటే- నాకు ఏమీ తెలియదని’’ అన్నాడు సోక్రటీస్‌. ‌నేర్చుకోవాలన్న ప్రతి మనిషి, ముందుగా నాకు ఏమీ తెలియదనుకోవాలి. తెలుసుకునే మార్గాన్ని అన్వేషిస్తాడు తెలుసుకుంటాడు. సాధిస్తాడు.

19వ శతాబ్దపు బెసి స్టేన్లీ అనే కవయిత్రి విజయం గురించి ఈ విధంగా చెప్పింది ‘‘ విజయం సాధించే వాడు ఎవరంటే, బాగా జీవించినవాడు, ఎక్కు వగా నవ్విన వాడు, ప్రేమించబడినవాడు, మేధావులచే గౌరవింపబడినవాడు చిన్న పిల్లల ప్రేమ పొందినవాడు,తన మూల ప్రతిభకు సానపెట్టి అనుకున్నది సాధించినవాడు. ఈ భూమిని తను పుట్టినప్పటి కంటే మెరుగైన ప్రదేశంగా మార్చిన వాడు, భూలోక సౌంద ర్యాన్ని ప్రశంసించకుండా ఉండలేనివాడు,ఇతరుల్లో ఉత్తమమైన దానికోసమే చూసి తన వద్ద ఉన్న ఉత్తమమైనదే వారికిచ్చినవాడు ఎవరి జీవితం స్ఫూర్తిదాయ కమో ఎవరి జ్ఞాపకం ఒక ఆశీర్వదమో అతడే విజేత.

జీవితాన్ని సార్ధకం చేసే ఒక పని అర్ధా న్నిచ్చే పని మీలో ప్రాణశక్తినిరగిల్చే పని సవాళ్ళు ఎదుర్కొనే సమయంలో కూడా మీ అసలైన తత్వాన్ని వ్యక్త పరిచేదే, అదే మీ అస లైన హృదయ సంబంధమైన పని అదే మీ తపన ప్రతి ఒక్కరిలో వారికే తెలియని ఒక గొప్ప టాలెంట్‌ ఉం‌టుంది. మీకు నిజ మైన ఆసక్తి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి మీకు ఏది సరియైనదో తెలియజెప్పే మీ మనస్సాక్షి యొక్క వాణిని మీరు వినగలగాలి మీలో తపనను జ్వలిపంజేసే ఒక పనిలో మీరు నిమగ్నమవ్వాలి ఆ పనిపట్ల మీలో తపన కలిగి ఉండాలి. తపనతో జీవించే వారు చైతన్య వంతమైన వ్యక్తిత్వంతో శోభిల్లు తారు. తపన లేకుండా ఏ ఒక్కరు ఏ పనిని సాధించలేదని గుర్తుంచుకోండి. అన్నింటి కంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. ఏదైనా సాధ్యం. 

బద్దిపూడి శీనయ్య, నెల్లూరు

0
0