खबर की मुख्य बातें
- ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఆవిర్భావ దినోత్సవ మరియు ఆర్టిఐ వారోత్సవాలు భాగంగా వృద్ధాశ్రమంలో పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది.
- ఈ సందర్భంగా సమాచార హక్కు రక్షణ చట్టం 2005 తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కమలాకర్ మాట్లాడుతూ తమ సొసైటీ ఆధ్వర్యంలో నిరంతరము గ్రామ స్థాయి వరకు సహా చట్టం పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలను చైతన్య వంతం చేయడం జరుగుతుందన్నారు.
- ప్రజలకు అందుబాటులో ఉంటూ సహచట్టం పై గల సందేహాలను నివృత్తి చేస్తూ, దరఖాస్తు విధానాలను తెలుపుతూ సహకరిస్తూ, ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్యనా వారధిగా ఉంటూ సహా చట్టం పకడ్బందీగా అమలు కావడానికి ప్రభుత్వ అధికారులతో కలిసి తమ సొసైటీ కృషి చేస్తుందన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఆవిర్భావ దినోత్సవ మరియు ఆర్టిఐ వారోత్సవాలు భాగంగా వృద్ధాశ్రమంలో పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సమాచార హక్కు రక్షణ చట్టం 2005 తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కమలాకర్ మాట్లాడుతూ తమ సొసైటీ ఆధ్వర్యంలో నిరంతరము గ్రామ స్థాయి వరకు సహా చట్టం పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలను చైతన్య వంతం చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సహచట్టం పై గల సందేహాలను నివృత్తి చేస్తూ, దరఖాస్తు విధానాలను తెలుపుతూ సహకరిస్తూ, ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్యనా వారధిగా ఉంటూ సహా చట్టం పకడ్బందీగా అమలు కావడానికి ప్రభుత్వ అధికారులతో కలిసి తమ సొసైటీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ జిల్లా స్టూడెంట్ వింగ్ కన్వీనర్ రాహుల్, జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ, ఆదిలాబాద్ రూరల్ మండల అధ్యక్షులు భూమన్న తదితరులు పాల్గొన్నారు.