రాపూరు, మే 18, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లిగూడూరు మండలంలో నరుకూరు, సౌత్ ఆములూరు, కొత్తపాళెం, వరకావిపూడి, వరిగొండ గ్రామాలలో పర్యటించి, ముస్లిం కుటుంబాలకు “రంజాన్ కానుక” ను పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రతి ముస్లిం కుటుంబం రంజాన్ పండుగను జరుపుకోవడానికి పండుగ సరుకులను పంపిణీ చేస్తున్నాం. రెక్కాడితే గాని డొక్కాడని పేద ముస్లిం కుటుంబాలు కరోనా నేపథ్యంలో రంజాన్ పండుగకు దూరం కాకూడదని, ప్రతి ముస్లిం కుటుంబం పండుగ చేసుకునేందుకు పండుగ సరుకుల పంపిణీ కార్యక్రమానికి రూపకల్పన చేశాము.సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం కుటుంబానికి సేమియా, చక్కెర, నెయ్యి, గోధుమపిండి, వంటనూనెను పంపిణీ చేస్తున్నాము. లక్ష కుటుంబాలకు పైగా సర్వేపల్లి రైతన్న కానుక పేరిట 3 కోట్ల 50 లక్షల విలువైన బియ్యం, వంట నూనెను ప్రతి కుటుంబానికి అందజేశాము. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఇంటి బిడ్డగా వ్యవహరించే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం సోదరుడికి, సోదరీమణికి ఈ సందర్భంగా ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు