संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पूर्वी गोदावरी

సమస్యాతీత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలపై DGP ఆరా

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సమస్యాతీత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలపై DGP ఆరా

खबर की मुख्य बातें

  • తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, అక్టోబర్ -08 (పున్నమి ప్రతినిధి) తూర్పు గోదావరి జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం ఎన్నికలు మరియు గోదావరి పుష్కరాల భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హరీష్ కుమార్ గుప్తా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని…
  • ఈ కీలక సమావేశంలో ఏలూరు రేంజ్ పరిధిలోని ఎస్పీలు (SPs), అదనపు ఎస్పీలు (ASPs), మరియు డీఎస్పీలతో (DSPs) డీజీపీ శాంతిభద్రతలపై విస్తృతంగా చర్చించారు.
  • రాబోయే మున్సిపల్, సర్పంచ్, MPTC, మరియు ZPTC ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు భద్రతా ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, అక్టోబర్ -08 (పున్నమి ప్రతినిధి) తూర్పు గోదావరి జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం ఎన్నికలు మరియు గోదావరి పుష్కరాల భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హరీష్ కుమార్ గుప్తా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కీలక సమావేశంలో ఏలూరు రేంజ్ పరిధిలోని ఎస్పీలు (SPs), అదనపు ఎస్పీలు (ASPs), మరియు డీఎస్పీలతో (DSPs) డీజీపీ శాంతిభద్రతలపై విస్తృతంగా చర్చించారు. రాబోయే మున్సిపల్, సర్పంచ్, MPTC, మరియు ZPTC ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు భద్రతా ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ అదనపు బలగాలను మోహరించాలని డీజీపీ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కల్పించాల్సిన భద్రత, పాత కేసుల స్థితిగతులు మరియు నిందితులపై తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనితో పాటు, రాబోయే ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాల బందోబస్తుకు సంబంధించి భారీ ఎత్తున భద్రతా ప్రణాళికలను సిద్ధం చేయాలని మరియు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *