संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
चित्तूर

సదుం అయ్యప్ప సన్నిధిలో భక్తుల సందడి: పోటెత్తిన మాలధారులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సదుం అయ్యప్ప సన్నిధిలో భక్తుల సందడి: పోటెత్తిన మాలధారులు

खबर की मुख्य बातें

  • Uploaded Video:

(మండల దీక్షల ప్రారంభం.. శరణుఘోషలతో మార్మోగిన ఆలయ ప్రాంగణం)
సదుం, అక్టోబర్ 12 (భాను ప్రసాద్ నాయుడు పున్నమి న్యూస్ ప్రతినిధి):
సదుం మండల కేంద్రంలో వెలసియున్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం భక్తుల నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అయ్యప్ప దీక్షా కాలం ఊపందుకోవడంతో సోమవారం స్థానిక ఆలయానికి మాలధారణ చేసే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మండలంతో పాటు పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు గురుస్వాముల సమక్షంలో నియమనిష్టలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, తులసి, రుద్రాక్ష మాలలను ధరించి మండల దీక్షలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ అయ్యప్ప స్వామి వారికి విశేష అభిషేకాలు, పుష్పాలంకరణలు, దీపారాధనలు అత్యంత నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా ‘స్వామియే శరణం అయ్యప్ప’ శరణుఘోషలతో మార్మోగింది. మాలధారణ చేసుకున్న స్వాములకు, దర్శనార్థం విచ్చేసిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో గురుస్వాములు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *