*డయాబెటిస్ ఉన్నవారు చెప్పులు కొనేటప్పుడు, ధరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు*
షుగర్ ఉన్నవారికి చెప్పులు కేవలం నడవడానికి మాత్రమే కాదు.. పాదాలను గాయాల నుంచి కాపాడే రక్షణ కవచాలు. ముఖ్యంగా డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి ఉన్నవారికి పాదాల్లో స్పర్శ తగ్గిపోవడం వల్ల చెప్పు కొరికినా (రాపిడి కలిగించినా), ముల్లు గుచ్చుకున్నా వెంటనే తెలియకపోవచ్చు. చిన్న గాయం కూడా తీవ్రమైన పుండుగా (డయాబెటిక్ ఫుట్ అల్సర్) మారే ప్రమాదం ఉంది.
*చెప్పులు కొనేటప్పుడు పాటించాల్సిన 10 జాగ్రత్తలు:*
*1.సరైన సైజు* : మరీ బిగుతుగా లేదా మరీ వదులుగా కాకుండా పాదానికి సరిగ్గా సరిపోయే చెప్పులను ఎంచుకోవాలి.
*2 .వెడల్పాటి ముందు భాగం:** కాలివేళ్లు ఒకదానిపై ఒకటి ఒత్తుకోకుండా, స్వేచ్ఛగా కదిలేలా ముందు భాగం విశాలంగా ఉండాలి.
3 .మృదువైన లోపలి భాగం:* లోపల గరుకుదనం లేకుండా, చర్మానికి గుచ్చుకునే కుట్లు లేని మృదువైన లైనింగ్ ఉండాలి.
*4.మెత్తని సోల్: నడిచేటప్పుడు* పాదాలపై ఒత్తిడిని తగ్గించేందుకు లోపల మంచి కుషనింగ్ ఉండాలి.
*5.మడమలకు రక్షణ:* నడిచే సమయంలో మడమలకు రాపిడి కలగకుండా పటిష్టమైన సపోర్ట్ ఇచ్చేలా ఉండాలి.
*6.గాలి ప్రసరణ:* పాదాలకు చెమట పట్టకుండా, గాలి ఆడేలా ఉండే సహజ తోలు (Leather) లేదా కాన్వాస్ మెటీరియల్ ఎంచుకోవాలి.
*7.మంచి పట్టు (Grip) ఉండే సోల్:* జారిపడకుండా నేలపై మంచి గ్రిప్ ఇచ్చే రబ్బర్ సోల్ ఉండాలి.
*8.మూసిన ముందు భాగం (Closed-toe):* రాళ్లు, ముళ్లు, అడ్డంకులు తగిలినప్పుడు వేళ్లకు గాయం కాకుండా ముందు భాగం మూసి ఉండేవి వాడటం శ్రేయస్కరం.
*9.సర్దుబాటు చేసుకునే పట్టీలు:* పాదం వాపు లేదా మార్పులకు అనుగుణంగా సర్దుకునేలా (Velcro/Straps) ఉండే పట్టీలు ఉండాలి.
*10.సాయంత్రం వేళ కొనడం:* రోజంతా తిరగడం వల్ల సాయంత్రానికి పాదాల పరిమాణం స్వల్పంగా పెరుగుతుంది. కాబట్టి సాయంత్రం వేళల్లోనే స్వయంగా తొడిగి చూసి కొనుగోలు చేయాలి
*చెప్పులు ధరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:*
*1.లోపల తనిఖీ చేయాలి:* చెప్పులు వేసుకునే ముందు వాటి లోపల చిన్న రాళ్లు, ఇసుక, ముళ్లు, కీటకాలు ఏమైనా ఉన్నాయేమో చేతితో తడిమి చూసుకోవాలి.
*2.పాదాల పరిశీలన:* చెప్పులు విడిచిన తర్వాత పాదాలపై ఎర్రటి మచ్చలు, బొబ్బలు లేదా రాపిడి గుర్తులు ఏవైనా ఏర్పడ్డాయేమో తప్పనిసరిగా గమనించాలి.
*3.ఇంట్లోనూ పాదరక్షలు:* ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడవకూడదు. ఇంట్లో వాడటానికి ప్రత్యేకంగా మెత్తని చెప్పులు ధరించాలి.
*4.నిషేధించాల్సినవి* : హైహీల్స్, బిగుతైన లేదా గట్టి అంచులు ఉన్న చెప్పులు, పాయింటెడ్-టో (ముందు భాగం సన్నగా ఉండే) చెప్పులు అస్సలు వాడకూడదు.
*5.క్రమంగా అలవాటు* చేసుకోవడం: కొత్త చెప్పులు కొన్నప్పుడు మొదట్లో రోజూ 1–2 గంటలు మాత్రమే వేసుకోవాలి. పాదాలకు ఎలాంటి ఒత్తిడి కలగడం లేదని నిర్ధారించుకున్నాక, సమయాన్ని పెంచుకుంటూ వారం తర్వాత రోజంతా వాడుకోవచ్చు.

समाचार स्रोत
- Punnami Reportingस्वयं की रिपोर्टिंग