గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో ఉన్న శ్రీ సౌభాగ్య దుర్గంబిక అమ్మవారి ఆలయంలో రేపు శనివారం దేవరపల్లి మూడు బొమ్మల సెంటర్ వద్ద 13వ శరన్నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా శ్రీ సౌభాగ్య దుర్గంబిక అమ్మవారి విగ్రహ వేలంపాట నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం తెలియజేశారు. 12వ తేదీ బుధవారం దేవరపల్లి పురవీధుల్లో సౌభాగ్య దుర్గంబిక అమ్మవారు పురవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు
తెలియజేశారు. శనివారం రాత్రి 7.30గంటలకు జరిగే వేలంపాటకు హాజరవ్వాలి సూచించారు.