संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

శ్రీ వల్లూరమ్మ అమ్మవారి ఆలయంలో ఆకుపాటి వెంకటేష్ ప్రత్యేక పూజలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
శ్రీ వల్లూరమ్మ అమ్మవారి ఆలయంలో ఆకుపాటి వెంకటేష్ ప్రత్యేక పూజలు

खबर की मुख्य बातें

  • పామూరు, అక్టోబర్ 6(పున్నమి ప్రతినిధి ): శ్రీ వల్లూరమ్మ అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రకాశం జిల్లా మాజీ ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు ఆకుపాటి వెంకటేష్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ సిబ్బంది సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
  • అనంతరం అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, అమ్మవారి ఆశీస్సులు పొందారు.

పామూరు, అక్టోబర్ 6(పున్నమి ప్రతినిధి ): శ్రీ వల్లూరమ్మ అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రకాశం జిల్లా మాజీ ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు ఆకుపాటి వెంకటేష్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ సిబ్బంది సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో పూజా కార్యక్రమాలను నిర్వహించి ఆకుపాటి వెంకటేష్‌కు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించిన ఆకుపాటి వెంకటేష్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది చేస్తున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. భక్తిశ్రద్ధలతో ఆలయానికి వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం సౌకర్యవంతంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *