శ్రీ నిత్య నూతన చిట్ ఫండ్ Pvt Ltd 6 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా : ఏపీ చిట్ ఫండ్ ఫెడరేషన్ శుభాకాంక్షలు

0
732

శ్రీ నిత్య నూతన చిట్ ఫండ్ Pvt Ltd ఘన విజయాన్ని జరుపుకుంటూ 6 వసంతాలు

శ్రీకాకుళం ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి)
శ్రీ నిత్య నూతన చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ తన విజయయాత్రలో మరో మైలురాయిని అధిగమించింది. 6 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. సంస్థ స్థాపన నుంచి నేటి వరకు నిరంతర అభివృద్ధి పథంలో సాగుతూ, కస్టమర్ల విశ్వాసాన్ని సంపాదించుకోవడంలో ప్రత్యేక గుర్తింపు పొందింది.

సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు మాట్లాడుతూ, “మా సంస్థ ఎదుగుదలకు ప్రధాన కారణం కస్టమర్ల మద్దతు, విశ్వాసం. మేము ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా, ప్రతి ఒక్కరి ఆశలను తీర్చే విధంగా ముందుకు సాగుతున్నాము,” అని హర్షం వ్యక్తం చేశారు. సంస్థ నిర్వహణలో పారదర్శకత, నిబద్ధత ప్రధానమైన అంశాలుగా నిలిచాయని వారు పేర్కొన్నారు.

గత ఆరు సంవత్సరాలలో శ్రీ నిత్య నూతన చిట్ ఫండ్ అనేక కొత్త చిట్ స్కీములను ప్రవేశపెట్టి వేలాది మంది సభ్యుల అభిమానం చూరగొంది. ముందున్న రోజుల్లో మరింత విస్తరణకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. డిజిటల్ సేవల ద్వారా మెరుగైన సదుపాయాలను అందించేందుకు సంస్థ కృషి చేస్తోంది అని సంస్థ డైరెక్టర్స్ తెలిపారు.ఏపీ చిట్ ఫండ్ ఫెడరేషన్ శుభాకాంక్షలు తెలిపారు

0
0