संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

శ్రీ చైతన్య స్కూల్‌లో మహిళా దినోత్సవ సందడి.. ఆకట్టుకున్న ఆత్మరక్షణ ప్రదర్శనలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
శ్రీ చైతన్య స్కూల్‌లో మహిళా దినోత్సవ సందడి.. ఆకట్టుకున్న ఆత్మరక్షణ ప్రదర్శనలు

खबर की मुख्य बातें

  • శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి ఫేమస్ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
  • మహిళా దినోత్సవ సందర్భంగా పాఠశాల ఆవరణ అంతా అందంగా అలంకరించి వేడుకలను ప్రారంభించారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫేమస్ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ముఖ్యఅతిథిగా విచ్చేశారు. మహిళా దినోత్సవ సందర్భంగా పాఠశాల ఆవరణ అంతా అందంగా అలంకరించి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు మహిళల గొప్పతనాన్ని చాటి చెప్పే నృత్యాలు, పాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. విచ్చేసినటువంటి మహిళలతో ఆటపాటలే కాకుండా, మహిళలకు ఆత్మ రక్షణకు ఉపయోగపడే కరాటే సెల్ఫ్ డిఫెన్స్ ను కూడా వారిచే చేయించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఎ. రూపాదేవి మాట్లాడుతూ.. మహిళలకు కావలసినటువంటి హక్కులు, సమన్యాయం, మహిళా సాధికారత గురించి అద్భుతమైన ప్రసంగాన్ని అందించారు. ఎ.జి.ఎం సురేష్ మాట్లాడుతూ.. మహిళలు కుటుంబము, సమాజంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని తెలిపి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ త్రివేణి, ఇన్చార్జులు కల్పన, వాసంతి, ఎ. ఒ. సురేష్, కరాటే మాస్టర్ సుబ్రహ్మణ్యం మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *