శ్రీరామకృష్ణుని కృపతో మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమం:: సాయి కుమార్ రెడ్డి బత్తిన

0
154

శ్రీరామకృష్ణుని కృపతో మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమం:

భగవాన్ శ్రీ రామకృష్ణుల ఆశీస్సులతో, ప్రమాదవశాత్తూ మమ్మల్ని విడిచి వెళ్లిపోయిన నా బిడ్డ (శిష్యుడు) ఏం.పవన్ కుమార్ రెడ్డి జ్ఞాపకార్థం, ఈ రోజు వేయి మందికిపైగా బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ పవన్ కుమార్ రెడ్డి స్నేహితులు పునీత్, సురేష్, భగత్, యూనస్, సందీప్, వినయ్, సాకేత్ హర్షోత్సాహంతో పాల్గొన్నారు.

వారి మిత్రుడి అపూర్వమైన స్నేహాన్ని స్మరించుకుంటూ, పవన్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని వారు ప్రార్థించారు.

ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన సాయి కుమార్ రెడ్డి బత్తిన మాట్లాడుతూ, “పవన్ చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ, మిగిలినవారికి స్ఫూర్తి కలిగించే విధంగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తామని” తెలిపారు.

పవన్ కుమార్ రెడ్డి జ్ఞాపకం ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచిపోయింది.

0
0