శ్రీకాకుళం జిల్లాలో నేటి ఆదివారం కరోనా హెల్త్ బులిటెనను జిల్లా కలెక్టర్ జె.నివాస్ వెల్లడించారు. మొత్తం 45601 మంది నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా..39580 మందికి రిపోర్టులు నెగిటివ్ వచ్చాయని చెప్పారు. ఇంకా 6021 మంది రిపోర్టులు రావాల్సి ఉందని చెప్పారు.అదివారం 1937 మంది నమూనాలను పంపినట్లు తెలిపారు.ఈ రోజు కొత్తగా కేసులు నమోదు కాలేదన్నారు.కాగా ప్రస్తుతం ఐదుగురు డిశ్చార్జి అయ్యి 9మంది చికిత్స పొందుతున్నారు