खबर की मुख्य बातें
- పున్నమి న్యూస్, అగనంపూడి, నవంబర్ 16: అనకాపల్లి జిల్లా, మండలం శీరంశెట్టివానిపాలెం లో స్వయభుంగా వేలిచిన శ్రీ శ్రీ శ్రీ ఉమా సమేత పంచముఖ నంది దేవాలయములో పవిత్ర కార్తీకమాస తొలి సోమవారం సందర్భంగా ఆలయమును అలంకరణ చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ తొలి పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
- అనంతరం ఆయన మాట్లాడారు.
పున్నమి న్యూస్, అగనంపూడి, నవంబర్ 16:
అనకాపల్లి జిల్లా, మండలం శీరంశెట్టివానిపాలెం లో స్వయభుంగా వేలిచిన శ్రీ శ్రీ శ్రీ ఉమా సమేత పంచముఖ నంది దేవాలయములో పవిత్ర కార్తీకమాస తొలి సోమవారం సందర్భంగా ఆలయమును అలంకరణ చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ తొలి పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్వయంభు గా నిలిచిన ఈ శివాలయములో భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరడం వల్ల చుట్టుపక్కల నుండి విశేషంగా భక్తులు వస్తున్నారనీ, కార్తీకమాసంలో ఈ దేవాలయమునకు అనకాపల్లి ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులు వెయ్యాలని కోరారు. ఆలయ కమిటీ ప్రతినిధి శీరంశెట్టి అప్పలరాజు మంత్రిపాలెం గ్రామం, పరవాడ శ్రీ సింహాద్రి లారీ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు రూ28వేల116 రూపాయలతో, 8 కేజీల కంచు గంటను ఆలయమునకు బహుకరించారనీ, డిసెంబర్ 4వ తేదీన ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరుగుతుందినన్నారు. పూడి సత్యారావు అట్టా రాధా శ్రీనివాస్ దంపతులు, ఆలయ కమిటీ ప్రతినిధులు మరియు భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
समाचार स्रोत
- Punnami Reportआधिकारिक बयान