కొత్తగూడెం జిల్లా :అక్టోబర్ 12:(పున్నమి ప్రతినిధి )..
ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవాసంఘం ఆధ్వర్యంలో హైద్రాబాద్ లో శంకర కంటి హాస్పిటల్ వారి సహకారంతో పేద ప్రజలకి ఉచిత కంటి వైద్య సేవలు మరియి కంటికి శాస్త్ర చికిత్సలు అందించేందుకు సేవకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అక్టోంబర్ నెలలో కొత్తగూడెం జిల్లా నుండి 149 మంది సభ్యులని కంటి ఆపరేషన్ కోసం పంపించటం జరిగిందని సంఘం ప్రతినిధులు తెలిపారు.కంటి సమస్యతో బాధపడేవారికి మెరుగైన వైద్యం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపాలన్నదే సంఘం లక్ష్యం అని తెలిపారు.ఈ సేవ కార్యక్రమంలో శివాజీ సేవ సంఘం స్థాపకులు సుంకు కనకరాజు,సహా వ్యవస్థాపకులు గునుగంటి చంద్ర, నమ్మి జగదీశ్ మరియు తదితరులు పాల్గొని కార్యక్రమ విజయానికి తగు సహకారం అందించారు.

