శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయిన గూడూరు కృష్ణదాసు మఠం
నిరుపేద యువకుల శ్రమతో జీవంపోసుకున్న మఠం
దాతల సహకారంతో అభివృద్ధి
కృష్ణదాసు అనబడే వ్యక్తి ఒకప్పుడు గూడూరులోని హుస్సేన్ అనే మహమ్మదీయుడు దగ్గర శిష్యరికం చేసి యోగిగా మారి ఆశ్రమాన్ని స్థాపించి ప్రజలకు నీతి వాఖ్యాలు భోదిస్తూ 1905 వ సంవత్సరంలో గూడూరు రాణిపేట వీధి పరిసరాల్లో మహా సమాధి చెందారు. అప్పటి వీరి శిష్య ప్రముఖులు అయ్యపనేని ఆదెమ్మగారిచే ఇక్కడ రామదాసు మఠం రూపుదిద్దుకొంది.
తదనంతరం కృష్ణదాసును అవధూతగా కొలుస్తూ వచ్చి కొన్ని సంవత్సరాలకు ఇక్కడ శివలింగ ప్రతిష్ట జరుపబడి సత్సంగం తదితర ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ వచ్చేవి. కాలక్రమేణా ఈ ఆశ్రమం ఆక్రమణలకు గురి అయి శిథిలావస్థకు చేరుకోవడంతో సరోజనమ్మ, నాగేశ్వర రావు గారిచే తిరిగి సజీవ స్థాయికి చేరుకొంది. మఠం ప్రాంతానికి చెందిన యువకులైన సాయిప్రసాద్, అరుణ్, వెంకటేశ్వర్లు, సుమన్, చంద్ర, రవికుమార్, శీను తదితరులు ఇక్కడ మరికొన్నిపూజా విగ్రహాలు, వసతులు నెలకొల్పి ధార్మిక ఉత్సవాలను జరుపుతున్నారు.వీరంతా కలసికట్టుగా శ్రమదానం చేసి మఠాన్నిమరింత సుందరంగా తీర్చిదిద్దారు.
ఉగాది, వినాయక చవితి, దసరా పండుగ, శివరాత్రి ఉత్సవాలను దాతల సహకారంతో అత్యంత భక్తి శ్రద్ధలతో జరపడం ఇక్కడ ఆనవాయితిగా వస్తుంది. శివరాత్రి రోజున మఠంలో ప్రత్యేక పూజలు మరియు భారీ అన్నదానము జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్చందంగా పాల్గొనడం ఇక్కడి విశేషంగా చెప్పవచ్చును