విసిగించకుండా ‘ ఫాలో అప్‌‘ ‌చెయ్యడం ఎలా?

0
152

(‌పున్నమి ప్రతినిధి) :
వ్యాపారంలో కానీ, పర్సనల్‌ ‌లైఫ్‌లో కానీ, ఉద్యోగంలో కానీ, మనం ఫలానా పని చేసి పెట్టమనో, ఫలానా పనిలో సాయం కావాలి అనో ఎవరినో అడుగుతాం. అది సోమవారం. ‘హా, బుధవారానికల్ల పని ఖతం ‘(ఎవరు ఖతం? మనమా? పని కాక పోతే మనం ఖతం!) అని హామీ ఇస్తారు.

బుధవారం నాడు అటువైపు నుంచి ఉలుకూ పలుకూ ఉండదు. ఫోన్‌ ఉం‌డదు. చడీ చప్పుడూ ఉండదు. అప్పడు మనం వారికి గుర్తు చేయాలి. మెయిల్‌ ‌రూపంలోనో, ఒక ఫోన్‌ ‌కాల్‌ ‌చేసో, లేదా అటు వైపు వెళ్ళినప్పుడు పలకరించడమో, లేదా ఒక ఫోన్‌ ‌మెసెజి ద్వారా నో. దీనినే మనం ఫాలో అప్‌ అం‌టాము.
వ్యక్తిగత జీవితంలోనూ, పనిలోనూ, వ్యాపారంలోనూ ఫాలో అప్‌ అవసరం! అయితే, అది ఎంతో కళాత్మకంగా ఉండాలి. పట్టి పీడించడంలా ఉండ కూడదు! అది ఎలానో మనం ఈ వారం చూద్దాం.
ఒక వేళ మీరు సేల్స్‌లో ఉన్నారు అనుకోండి. మీ కష్టమరు
‘వచ్చే వారం చూద్దాంలే!’ అంటారు. ‘వచ్చే నెల’ అంటారు. ఆ టైంలో ఫోన్‌ ‌చేస్తే రెస్‌పాన్స్ ఉం‌డదు.
ఒక మిత్రునికి ఒక పనిలో సాయం అడుగుతారు. ‘ఆ శాఖలో నా క్లాస్‌మేటు ఉన్నాడు! చిటికలో పని అయిపోతుంది! అంటాడు. ఆ బుధవారం రానే వస్తుంది, ఇతని నుంచి సౌండు ఉండదు!
‘నాన్నా ! శుక్రవారం కల్లా ఆన్‌లైన్‌లో నా ఫీజు కట్టాలి’ అని అమ్మాయి అంటుంది. శుక్రవారం వస్తుంది, పని వత్తిడిలో తండ్రి మరిచిపోతాడు. నాన్నకు గుర్తు చెయ్యాలంటే భయం! ఎలా?
ఫాలో అప్‌ ‌చెయ్యకుండా ఆపలేము. కానీ అది వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఇలా ప్రయత్నించడి.
(1) మనకు ఒక వ్యక్తి 4 రోజులలో మీ పని అయి పోతుంది అని చెప్పారు అనుకోండి. ‘‘అయితే ఒక సారి శుక్రవారం మీకు గుర్తు చేస్తాను సర్‌. ‌ఫోన్‌ ‌ద్వారా కానీ, మెసేజి ఇచ్చి కానీ’’ అని ముందరే అనుమతి తీసుకోండి.
(2) ఫాలో అప్‌కి ఫోన్‌ ‌చేసినప్పుడు, నేరుగా విషయంలోకి రండి. సున్నితంగా. ‘‘మీకు గుర్తు చెయ్యడానికి ఫోన్‌ ‌చేసాను సర్‌ / ‌మేడం’’ అనకండి. ఇగో దెబ్బ తినవచ్చు .
(3) ఫోన్‌ ‌వారు లిఫ్ట్ ‌చెయ్యక పోతే, బిజీగా ఉన్నారు అని అర్ధం చేసుకుని ఒక మెసేజి పెట్టండి. ఇమెయిల్‌ అయినా ఫరవా లేదు.
(4) మనకి బిజినెస్‌ ఇస్తానన్న వ్యక్తి లేక సాయం చేస్తాను అన్న వ్యక్తి, ఆ మాట మీద నిలబడ వచ్చు, లేదా నిలబెట్టుకోలేక పోవచ్చు. కానీ మనం అడిగే విధానం మాత్రం పాజిటివ్‌గా ధ్వనించాలి !!
ఉదాహరణకి ‘‘ మొన్న మనం అనుకున్నాం కద సార్‌? ‌పెండింగ్‌ ‌పేమెంటు విషయం పూర్తి చేద్దామని? ఈ రోజు చేసేద్దామా?’’ అని అడగండి.!
(5) ఇలా మాత్రం అడగకండి ! ‘‘మొన్న సోమవారం కలిసినప్పుడు, ఈ రోజు చెక్కు ఇస్తాము అన్నారు! ఈరోజైనా కుదురుతుందా లేదా?’’ ఇలా! సందేహిస్తున్నట్లు అడగకండి! మరింత టైం తీసుకుంటారు.
(6) ఫోన్‌లో అయితే, మీ కంఠం ఆహ్లాదకరంగా ఉండేటట్టు చూసుకోండి (మనసులో మండిపోతున్నా సరే!).
(7) కొన్ని సందర్భాలలో డెడ్‌ ‌లైన్‌కి ముందరే ఫాలో అప్‌ ‌మంచిది. అది ఆ పని ఎంత కీలకమైనది? దాని ప్రాధాన్యాన్ని బట్టి ఉంటుంది. ఉదా:ఒక వ్యక్తి మీకు ‘గురువారం సాయంత్రానికల్లా పని అయిపోతుంది’ అని హామీ ఇచ్చారు అనుకోండి. అతను మహా బిజీగా ఉండి మరచి పోవచ్చు. బుధవారం ప్రొద్దున్నే ఫోన్‌ ‌చేసి, చాకచక్యంగా, లౌక్యంగా ‘ మేడం / సార్‌ ! ఈ ‌హోదాలో మీరు చాలా బిజీగా ఉంటారు అని నాకు తెలుసు. అందుకే కొంచెం గుర్తు చేయడానికి! రేపూ సాయంత్రానికల్లా మన పని అవుతుందన్నారు కదా? ఆ విషయం’! అని గుర్తు చేయండి. అవతలి వ్యక్తి మీకంటే వయసులోనూ, అధికారం లోనూ పైన ఉంటే, ఈ పని చాలా జాగ్రత్త గా చేయాలి!
పని కాదు అని తెలిసిన తరువాత :
ఇంత ప్రయత్నం చేసినా, ఒక్కోసారి మనం అనుకున్న పని కాదు. అలాంటప్పుడు ఇక ఆ వ్యక్తి ని ఫాలో అప్‌ ‌చెయ్యడం వదిలేయాలి . ఆ వ్యక్తి వల్ల కాదు. ఇబ్బంది పెట్ట వద్దు !
ఒక్కో సారి మన విషయం లో కూడా అలా జరగ వచ్చు . మనం ఎవరికో ఏదో సహాయం చేస్తాము అని మనసుతో ప్రామిస్‌ ‌చేస్తాము . కానీ ఆ తరువాత మన పరిస్థుతులు అనుకూలంగా లేక పోవచ్చు ! ఇవి వ్యాపారంలో సహజం !
(8) పని కాకపోయినా వారితో సత్సంబంధాలు చెడగొట్టుకోకండి. ఈ రోజు కాకపోతే, భవిష్యత్తులో ఉపయోగ పడగలరు . ‘‘ ఫర్వాలేదు సార్‌, ‌నేను అర్ధం చేసుకోగలను. గుడ్‌డే ‘అని విష్‌ ‌చేసి ఫోన్‌ ‌పెట్టేయండి

0
0