వివాహేతర సంబంధం వీడలేకే బలవన్మరణం
నెల్లూరు జనవరి (పున్నమి- విలేఖరి ): వివాహేతర సంబంధం పెళ్ళైనఇద్దరు దంపతుల బలవన్మరణానికి దారి తీసింది.ఇద్దరు సచివాలయ ఉద్యోగుల ప్రాణాలు గాలిలోకలిశాయి..రెండుకుటుంబాల్లో విషాదాన్ని నింపింది..ప్రభుత్వ ఉద్యోగంలోఉంటూ ఉన్నతస్థితికి ఎదగాల్సిన వారిజీవితాలు విషాదంతోముగిశాయి…వివాహేతరబంధాలు ఎలాంటి పరిణామాలు..ఎంతటి దారుణదారుణానికి దారి తీస్తుందో ఇవాళ నెల్లూరు జిల్లాలోజరిగిన ఘటన ప్రత్యక్షతార్కాణంగా ఉంది..
నెల్లూరు నగరంలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర బంధం వీడమన్నందుకు…జీర్ణించుకోలేని ఆజంట ప్రాణాలు తీసుకుంది.. పెళ్ళై భార్యా, భర్తలు ఉన్న వారు తాము విడిపోము… మమ్మల్ని క్షమించండి
..అంటూ ఓలేఖరాసి..బలవన్మరానికి పాల్పడ్డారు. ప్రేమించుకున్నట్లు చెబుతున్న ఇద్దరు సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరు నగర శివారులోని ఓ నందా ఓయో లాడ్జిలో ఈ దుర్ఘటన జరిగింది. ఓకే చున్నికీ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.
నెల్లూరు నగర శివారులోని ఓ లాడ్జిలో సచివాలయ ఉద్యోగులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది..నెల్లూరు రూరల్ మండలానికి చెందిన హరీష్, చిట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. అదే సచివాలంలో నాయుడుపేటకు చెందిన లావణ్య వీఆర్వో గా పని చేస్తున్నారు. వీరిద్దరూ శుక్రవారం విధులకు హాజరుకాలేదు.
వివాహితులైన వీరిద్దరూ కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కలిగిఉన్నారు..ఈవిషయం కుటుంబ సభ్యులకు తెలిసింది.. వారు ఇద్దరినీ మందలించారు. అయినా వారిలో మార్పు రాకపోగా.. వీళ్ళిద్దరూ అనధికారికంగా వివాహం చేసుకున్నారు.ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు నగర శివారు ప్రాంతమైన పడారుపల్లి సమీపంలోని నందా లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఆపై ఆత్మహత్య చేసుకున్నారు.
నెల్లూరు వెళ్తున్నాం.. అన్న హరీష్,లావణ్య ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత అర్ధరాత్రి దాటాక ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు ముందు హరీష్ రావ్ అన్న రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పని చేస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి.. అంటూ రెండు లైన్లలో ఆ లేఖను ముగించారు…బలవన్మరణానికి పాల్పడిన హరీష్, లావణ్య లు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లావణ్యకు గతంలో సైదాపురం మండలం లోని సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి వివాహం కాగా.. హరీష్ కు తమ సమీప బంధువుల అమ్మాయితో వివాహమైనట్లు పోలీసులు తెలిపారు. వివాహేతరబంధం వీడలేక వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.