నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: పోలీసులు
పుల్లంపేట: రాబోయే వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించి పోలీసు శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ సూచనలు, పర్యవేక్షణలో కోడూరు రూరల్ సర్కిల్ సీఐ శ్రీ డి. శ్రీనివాసులు, పుల్లంపేట ఎస్సై శ్రీ వి. చిన్నరెడ్డప్ప పుల్లంపేట మండలంలోని వివిధ గ్రామాల వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా విగ్రహాల ప్రతిష్ఠాపనకు ముందు సంబంధిత పోలీసు శాఖతో పాటు ఇతర సంబంధిత శాఖలకు ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. ప్రజా రహదారులు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్‌కు లేదా అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించే విధంగా మండపాలు ఏర్పాటు చేయరాదని తెలిపారు.మండపాల వద్ద విద్యుత్, అగ్నిమాపక, లైటింగ్‌తో పాటు జనసమ్మర్ద నియంత్రణకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణకు బాధ్యత వహించే వాలంటీర్లను అందుబాటులో ఉంచి వారి వివరాలను పోలీసులకు అందజేయాలని, పిల్లలను కార్మికులుగా వినియోగించరాదని స్పష్టం చేశారు.రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అధిక శబ్దంతో కూడిన కార్యక్రమాలు నిర్వహించరాద
