దేశంలో రాష్ట్రాల వారీగా విద్యుత్ వాహనాల కోసం చిన్న బ్యాటరీ మార్పిడి స్టేషన్ల వివరాలను ఇవ్వాల్సిందిగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మంగళవారం పార్లమెంట్లో అడిగారు. బ్యాటరీల ఏకరీతి ప్రమాణాల కోసం అమలు చేసిన ప్రయత్నాలు ఏమిటని కూడా అడిగారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ దీనికి సమాధానం ఇస్తూ దేశంలో ప్రస్తుతం 54 బ్యాటరీ మార్పిడి స్టేషన్లు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లో రెండు ఉన్నాయని రాతపూర్వకంగా తెలిపారు. బ్యాటరీ మార్పిడి విధానాన్ని అమలు చేయడానికి వాటాదారుల సంప్రదింపుల కోసం నీతి అయోగ్ ఆ విధానాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసిందని పేర్కొన్నారు.
Home జాతీయ అంతర్జాతీయ విద్యుత్ వాహన బ్యాటరీ మార్పిడి స్టేషన్ల వివరాలు ఇవ్వండి పార్లమెంట్లో అడిగిన ఎంపీ...