*పటిష్ట బందోబస్త్ నడుము ప్రశాంతంగా ముగిసిన హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ-జిల్లా ఇంచార్జ్ ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,IPS.,
*శోభయాత్ర AC సుబ్బారెడ్డి స్టేడియం నుండి RSR స్కూల్ వరకు నిర్వహణ.*
*ఎప్పటికప్పుడు శోభయాత్ర కదలికలను కమాండ్ కంట్రోల్ నుండి CC కెమెరాల ద్వారా పరిశీలిస్తూ అధికారులకు తగిన సూచనలు జారీ.*
*ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విజయవంతంగా శోభయాత్ర నిర్వహణ.*
*మంచి సమన్వయంతో విజయవంతంగా బందోబస్త్ నిర్వహించిన పోలీసు అధికారులను మరియు సిబ్బందిని అభినంధించిన ఎస్పీ గారు.*
నెల్లూరు పట్టణంలో ఆదివారం జరిగిన హనుమ భక్త శోభాయాత్ర బైక్ ర్యాలీ, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి KVR పెట్రోల్ బంక్ మీదగా RTC బస్టాండ్, గాంధీబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్ మీదగా స్టోన్ హౌస్‌పేటలోని ఆర్ఎస్ఆర్ (RSRM) పాఠశాల వరకు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా, ఉత్సాహంగా ముగిసింది. వేలాది మంది భక్తులు జై హనుమాన్ జై శ్రీరామ్ అని వినాదాలు చేస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ యాత్రలో పాల్గొన్నారు.
హనుమాన్ శోభాయాత్రను జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి సీసీ కెమెరాల ద్వారా జిల్లా ఇన్చార్జి ఎస్పీ గారు నిరంతరం పర్యవేక్షిస్తూ, శోభాయాత్ర సాఫీగా మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాత్ర మార్గంలో ట్రాఫిక్‌ను మరియు ప్రజల కదలికలను, శోభయాత్ర జరుగుతున్న విధానం, వెళ్ళే మార్గం, చుట్టుపక్కల పరిస్థితులను గమనిస్తూ పోలీస్ అధికారులకు ఎప్పటికప్పుడు పలు సూచనలు తెలియజేశారు.
పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకొని, సజావుగా కార్యక్రమం ముగియడానికి కృషి చేశామని, శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ముందస్తుగా అన్ని భద్రతా ఏర్పాట్లను చేపట్టి, డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల మానిటరింగ్, మొబైల్ పార్టీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది సహకారం, కృషి కారణంగానే విజయవంతంగా, ఎలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా బందోబస్తు నిర్వహించగలిగామని ఇంచార్జ్ ఎస్పీ గారు తెలిపారు. మున్ముందు కూడా ఇదే స్ఫూర్తి తో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు.
ఎవరికి కేటాయించిన విధులను వారు అప్రమత్తంగా ఉంటూ సమర్ధవంతంగా నిర్వర్తించడం, వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ సాఫీగా సాగేలా నిరంతరం పర్యవేక్షించి, బందోబస్తు విధులు నిర్వహించి, విజయవంతంగా ర్యాలీ ముగింపుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు” తెలిపారు. అంతేకాకుండా, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.